Elephant Milk Side Effects: ఈ జంతువు పాలు చాలా డేంజర్.. ఎందుకంటే..
ABN , Publish Date - Jul 06 , 2025 | 03:48 PM
పాలు ఆరోగ్యానికి మంచివని అంటారు. అయితే, ఈ జంతువు పాలు మనుషులకు చాలా డేంజర్. ఎందుకంటే, వీటిల్లో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఆ పాలు తాగితే..
Elephant Milk Side Effects: పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. పాలలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి, ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాల ఆరోగ్యానికి, కండరాల పెరుగుదలకు, గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి. పాలు అనేక రకాలుగా ఉంటాయి. ఆవు పాలు, గేదె పాలు, మేక పాలు, గొర్రె పాలు, ఒంటె పాలు ఇలా చాలా రకాల పాలు ఉన్నాయి. అయితే, ఏనుగు పాలల్లో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉంటుందని మీకు తెలుసా? ఈ జంతువు పాలల్లో 60 శాతం ఆల్కహాల్ ఉంటుందట.
ఏనుగులు సహజంగా చెరకును ఇష్టంగా తింటాయి. అందుకే ఎక్కువగా చెరకు తోటలపై దాడి చేస్తాయి. ఇవి చెరుకును ఎక్కువగా తింటాయి కాబట్టి, చెరకులో అధికంగా ఉండే ఆల్కహాల్-ఫార్మింగ్ ఎలిమెంట్స్ కారణంగా ఏనుగు పాలలో కూడా ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ ఏనుగు పాలు మనుషులకు చాలా ప్రమాదకరం. ఎందుకంటే, వీటిలో ఉండే కెమికల్స్ ఎక్కువగా హాని కలిగిస్తాయి. అందుకే, ఇవి తాగడానికి పనికిరావని అంటారు.
ఏనుగు పాలలో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉంటుందని, బీటా కేసైన్ ఉండడం వల్ల లాక్టోస్ కూడా ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఏనుగు పాలు తాగడం మనుషులకు సురక్షితం కాదు. ఈ పాలు రెండు సిప్స్ తాగినా కూడా మూర్ఛ పోతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటిలో కార్బొహైడ్రేట్స్ అధిక పరిమాణంలో ఉంటాయని, వీటిని తాగిన వెంటనే కడుపు నొప్పి సమస్యలు, విరేచనాలు వంటి సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుందని చెబుతున్నారు.
Also Read:
గ్రీన్ టీ తాగుతున్నారా? సరైన సమయం ఏదో తెలుసుకోండి.
మీరేంటో మీ పొట్ట చెప్పేస్తుంది..
For More Health News