Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..
ABN, Publish Date - May 21 , 2025 | 05:05 PM
పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది. అయితే, ఈ సమస్యలతో బాధపడేవారు పాలు తాగకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పాలు.. శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను అందిస్తాయి. దీంట్లో కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ పాలు తాగడం ద్వారా ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. అంతేకాకుండా, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే, రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. అయితే, కొంతమందికి పాలు హానికరం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారు పాలు తాగితే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అయితే, ఏ వ్యక్తులు పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం..
జీర్ణ సమస్యలు
జీర్ణ సమస్యలతో బాధపడేవారు పాలు తాగడం మంచిది కాదు. ఎందుకంటే పాలు తాగడం వల్ల వారికి గ్యాస్, కడుపు బరువుగా అనిపించడం వంటి సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఊబకాయం
మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే పాలు తాగకుండా ఉండాలి. ఎందుకంటే, పాలలో అధిక కేలరీలు, కొవ్వు ఉంటాయి. ఇవి బరువు పెరిగేలా చేస్తాయి. కాబట్టి, ఇప్పటికే ఊబకాయంతో బాధపడుతున్నవారు పాలు తాగకుండా ఉండటం మంచిది.
డయాబెటిస్
డయాబెటిస్‌తో బాధపడేవారు పాలు తాగకుండా ఉండటం మంచిది. ముఖ్యంగా ఒక వ్యక్తికి టైప్-2 డయాబెటిస్ ఉంటే, పాలు రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. ఇది కాకుండా, పాలలో లాక్టోస్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తుంది.
Also Read:
Waqf Board: వక్ఫ్ బిల్లుపై కేంద్రం సంచలన వ్యాఖ్యలు! ఏం అందంటే..
CPEC: ఆప్ఘన్ వరకూ చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ విస్తరణ.. భారత్ అభ్యంతరం
Updated Date - May 21 , 2025 | 05:05 PM