Kitchen Tips: అన్నం వండడానికి ముందు బియ్యం కడగడం మంచిదేనా..
ABN, Publish Date - Jun 25 , 2025 | 02:22 PM
అన్నం వండడానికి ముందు బియ్యం కడుగుతారు. అయితే, అసలు బియ్యాన్ని ఎందుకు కడగాలి? దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Kitchen Tips: మనం తినే అన్నం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది శక్తికి మంచి మూలం. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు ఇందులో ఉంటాయి. అన్నం గంజి కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. సాధారణంగా , అన్నం వండడానికి ముందు బియ్యాన్ని రెండు మూడు స్లారు కడుగుతారు. అయితే, అసలు బియ్యాన్ని ఎందుకు కడుగుతారు? దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మనం బియ్యంలో నీళ్లు పోసి బియ్యాన్ని ఒకటికి రెండు మూడు సార్లు బాగా కడుగుతూ ఉంటాము. మీరు కూడా మీ ఇంట్లో బియ్యాన్ని కడుగుతూ ఉంటారా.. అయితే, కచ్చితంగా మీరు ఈ ముఖ్య విషయాలను తెలుసుకోవాలి. అయితే, ఇలా బియ్యాన్ని కడగడం వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.
అన్నం వండడానికి ముందు బియ్యాన్ని ఒకటికి రెండుసార్లు కడగాలి. ఎందుకంటే, బియ్యం మీద దుమ్ము ధూళి ఎక్కువగా ఉంటుంది. అలానే, బియ్యం మీద లోహపు పొడి కూడా ఉంటుందని, ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా బియ్యాన్ని కడిగితే 90% వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయని అంటున్నారు. కాబట్టి, కచ్చితంగా ఈ వ్యర్థ పదార్థాలను తొలగించడానికి అన్నం వండే ముందు బియ్యాన్ని కడగాలి. అయితే, బియ్యం కడగడం వలన రాగి ఐరన్ జింక్ వంటి పోషకాలు కూడా పోతాయి కాబట్టి.. బియ్యాన్ని.. మరీ ఎక్కువ సార్లు కడగడం మంచిది కాదు. కేవలం 1-2 సార్లు కడగడం ఆరోగ్యానికి మంచిది. అంతకుమించి కడిగితే అన్నం తిన్న ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
బద్దకానికి కారణమయ్యే ఆహారాలు ఇవే..
టాటూ ఉన్న వాళ్లు రక్తదానం చేయడం మంచిదేనా..
For More Health News
Updated Date - Jun 25 , 2025 | 02:25 PM