ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chicken Cancer Risk: 300 గ్రాములు మించితే

ABN, Publish Date - May 06 , 2025 | 03:08 AM

వారానికి 300 గ్రాములకంటే ఎక్కువగా చికెన్‌ తినడం జీర్ణశయాంతర క్యాన్సర్‌ ముప్పును రెట్టింపు చేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. పురుషుల్లో మరణాల రిస్క్‌ కూడా 27% ఎక్కువగా ఉండే అవకాశముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు

పారాహుషార్‌

మాంసాహారుల్లో చికెన్‌ను ఇష్టపడని వారు ఉండరు. కొందరికైతే ఆదివారం వచ్చిందంటే చికెన్‌ లేనిదే ముద్ద దిగదు. అయితే చికెన్‌ తినడం వల్ల క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుందని ఓ తాజా అధ్యయనంలో తేలింది. ఆ వివరాలు తెలుసుకుందాం. వయసు, ఆరోగ్యం, వైద్య చరిత్ర వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, 19 ఏళ్ల పాటు, నాలుగు వేల మందిపై ఇటలీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో పలు విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. వారానికి 300 గ్రాముల కోళ్ల ఉత్పత్తులు తినడం వల్ల జీర్ణశయాంతర క్యాన్సర్‌ ముప్పు రెండింతలు ఎక్కువవుతుందని న్యూట్రియంట్స్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఆ అధ్యయనంలో వెల్లడైంది.


ఈ ప్రమాదం మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువని పరిశోధకులు తేల్చారు. అలాగే వారానికి 300 గ్రాములు, అంతకంటే ఎక్కువగా కోళ్ల ఉత్పత్తులు తినే వారిలో మరణాల ముప్పు కూడా 27 శాతం అధికమని గుర్తించారు. చికెన్‌లో మన శరీరానికి అవసరమైన ప్రొటీన్‌, విటమిన్‌ బి12, కోలిన్‌ వంటివి పుష్కలంగా ఉన్నప్పటికీ, చికెన్‌ను వారానికి 100 గ్రాములకు మించకుండా మితంగా తినడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.


Read Also: Rahul meets PM Modi : ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్‌ గాంధీ భేటీ

Sonu Nigam: పహల్గాం ఘటనపై సోనూ నిగమ్‌ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..

India vs Pakistan Missile Power: భారత్‌తో పోలిస్తే పాక్ క్షిపణుల సామర్థ్యం ఎంతంటే..

Updated Date - May 06 , 2025 | 03:08 AM