Blood Pressure: ఇంట్లోనే బీపీ చెక్ చేసుకుంటున్నారా? ఈ ముఖ్య విషయాలపై జాగ్రత్త.!
ABN, Publish Date - Jul 25 , 2025 | 12:39 PM
మీరు తరచుగా ఇంట్లోనే బీపీ చెక్ చేసుకుంటున్నారా? అయితే, ఈ ముఖ్య విషయాలపై జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: రక్తపోటు (బీపీ) చాలా మందికి సాధారణ సమస్యగా మారింది. దీనిని నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే, తరచూ హాస్పిటల్‌కి వెళ్లకుండానే, మనం ఇంట్లోనే బీపీ చెక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా అధిక రక్తపోటు లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు రెగ్యులర్‌గా బీపీ చెక్ చేసుకోవడం తప్పనిసరి. అయితే, ఇంట్లో బీపీ సరిగ్గా కొలవాలంటే పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సరైన బీపీ యంత్రాన్ని ఎలా ఎంచుకోవాలి
బ్రాచియల్ కఫ్ తీసుకోండి. ఇది మణికట్టు కఫ్ కంటే మీకు మరింత ఖచ్చితమైన రీడింగ్ ఇస్తుంది.
ఆటోమేటిక్ మానిటర్ తీసుకోవడం ఉత్తమం.
మెమోరీ ఉన్న మానిటర్ తీసుకోండి. ఇది పాత రీడింగ్‌లను సేవ్ చేస్తుంది.
కఫ్ మీ చేయికి సరిగ్గా సరిపోయేలా చూసుకోండి.
పరికరం కరెక్ట్‌గా పని చేస్తుందో లేదో చెక్ చేయండి. ఒకసారి డాక్టర్ వద్ద లేదా ఫార్మసీలో సరిచూసుకోండి.
బీపీ చెక్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బీపీ చెక్ చేసే 30 నిమిషాల ముందు ధూమపానం చేయడం, టీ/కాఫీ తాగడం, లేదా వ్యాయామం చేసే అలవాటు మానుకోండి.
ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని విశ్రాంతి తీసుకోండి.
సరిగ్గా కూర్చొని బీపీ చెక్ చేసుకోవాలి. వెన్ను నిటారుగా ఉంచండి, పాదాలు నేలపై చదునుగా ఉంచండి. చేయి మడతపెట్టకుండా స్ట్రెయిట్‌గా ఉంచి బీపీ చెక్ చేసుకోండి.
బీపీ ఎలా, ఎప్పుడు కొలవాలి?
కఫ్‌ను మోచేయి మడతకి ఒక అంగుళం పైన పెట్టాలి.
ఒక నిమిషం తేడాతో రెండు సార్లు కొలవండి.
ఉదయం ఒకసారి (మందు వేసుకునే ముందు), రాత్రి ఒకసారి (భోజనానికి ముందు) చెక్ చేయండి.
ప్రతిరోజూ రెండు సార్లు బీపీ కొలవండి.
మీ పరికరం, రీడింగ్‌లు డాక్టర్‌కి చూపించండి.
ముఖ్య సూచన:
ఇంట్లో కొలిచే బీపీ రీడింగ్‌లు, ఆసుపత్రిలో కొలిచే రీడింగ్‌లతో కొద్దిగా తేడా ఉండవచ్చు. కానీ మీరు వాడుతున్న పద్ధతి సరైందా? యంత్రం సరిగ్గా పని చేస్తుందా? అనే విషయంపై దృష్టి పెట్టండి.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
అప్పులు తీర్చలేక ఇద్దరు రైతుల ఆత్మహత్య
Read Latest Telangana News and National News
Updated Date - Jul 25 , 2025 | 01:20 PM