Immunity Foods: మారుతున్న వాతావరణం... పిల్లల్ని రక్షించే 5 సూపర్ ఫుడ్స్..
ABN, Publish Date - May 27 , 2025 | 12:46 PM
మారుతున్న వాతావరణంలో పిల్లలు అనారోగ్యానికి గురికాకుండా కాపాడుకోవడం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు పిల్లల ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రోగనిరోధక శక్తిని పెంచె ఫుడ్స్ తినిపించాలి. అలాంటి 5 సూపర్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలో వాతావరణం మారింది. అకాల వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. ఈ వర్షాల వల్ల వైరస్‌లు, బ్యాక్టీరియా మరింత యాక్టివ్‌గా ఉంటూ మనుషులను అనారోగ్యానికి గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు.. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి, పిల్లల రోగనిరోధక శక్తిని పెంచడానికి ఏమి తినిపించాలి? ఏలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వారు ఆరోగ్యంగా ఉంటారు అనే విషయాలను తెలుసుకుందాం..
ఇంట్లో ఆహారం
మారుతున్న ఈ వాతావరణంలో బయట వేయించిన ఆహారం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి, మీ పిల్లలకు ఇంట్లో తయారుచేసిన తాజా ఆహారాన్ని మాత్రమే తినిపించండి. వర్షంలో తడవకుండా ఉండేలా చూసుకుంటూ తగినంత విశ్రాంతి తీసుకునేలా చూడండి.
పాలు తాగిస్తూ ఉండండి
మీ పిల్లలకు ప్రతి రోజు క్రమం తప్పకుండా పాలు ఇవ్వండి. దీనివల్ల పిల్లలకు కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి పోషకాలు లభిస్తాయి. పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే పిల్లలకు పెరుగు, నెయ్యి, జున్ను కూడా ఇవ్వండి.
సిట్రస్ పండ్లు
పిల్లలకు ఖచ్చితంగా సిట్రస్ పండ్లను తినిపించాలి. ఎందుకంటే, ఆ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది బలమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీనివల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందువల్ల అవి వ్యాధులతో పోరాడడంలో ప్రభావవంతంగా ఉంటాయి.
కూరగాయలు
ఆరోగ్య నిపుణుల ప్రకారం, రోగనిరోధక శక్తిని పెంచడానికి కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి. దీనితో పాటు గోంగూర, పుదీనా, కొత్తిమీర తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కడుపును చల్లగా ఉంచుతూ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
తగినంత నీరు
ఈ సీజన్‌లో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి, పిల్లలకు తగినంత నీరు ఇస్తూ ఉండండి. మీరు వారికి కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ, మజ్జిగ, చెరకు రసం, పండ్ల రసం వంటివి ఇవ్వవచ్చు. నీరు లేకపోవడం వల్ల మీ పిల్లలు అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి, తరచు వారికి తగినంత నీరు ఇవ్వండి.
Also Read:
చాపకింద నీరులా.. ప్రోస్టేట్ క్యాన్సర్
రక్తదానం చేయడానికి హిమోగ్లోబిన్ ఎంత ఉండాలి..
For More Health News
Updated Date - May 27 , 2025 | 01:08 PM