Health Tips: ఈ 5 అలవాట్లు పాటిస్తే.. వయస్సు పెరిగినా అందం తగ్గదు..
ABN, Publish Date - Jun 29 , 2025 | 02:44 PM
మీరు 60 ఏళ్ల వయసులో కూడా యవ్వనంగా, ఆరోగ్యంగా కనిపించాలనుకుంటే మీ జీవనశైలిలో ఈ 5 అలవాట్లను చేర్చుకోవడం ముఖ్యం.
నేటి బిజీ జీవితంలో చాలా మంది తమ కోసం సమయం కేటాయించలేకపోతున్నారు. దీని వల్ల ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, చర్మ సమస్యలు వంటివి ఎన్నో ఎదురవుతున్నాయి. అయితే, మీరు 60 ఏళ్ల వయసులో కూడా యవ్వనంగా, ఆరోగ్యంగా కనిపించాలనుకుంటే మీ జీవనశైలిలో ఈ 5 అలవాట్లను చేర్చుకోవడం ముఖ్యం.
ప్రతిరోజూ వ్యాయామం
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలి. రోజూ కనీసం 30 నిమిషాలు నడక, యోగా, స్ట్రెచింగ్ లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. కండరాలు బలంగా ఉండి, చర్మం ముడతలు లేకుండా మెరిసిపోతుంది.
పోషకాహారం
ఆహారం మన ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తుంది. కూరగాయలు, తాజా పండ్లు, గింజలు, ఒమేగా-3 కొవ్వులు ఉండే ఆహారం తీసుకుంటే చర్మానికి పోషణ కలుగుతుంది. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల చర్మం హైడ్రేడెట్‌గా ఉంటుంది.
తగినంత నిద్ర
రోజుకు కనీసం 7–8 గంటలు నిద్ర అవసరం. గాఢ నిద్ర వల్ల శరీరం రిపేర్ అవుతుంది. చర్మానికి విశ్రాంతి లభిస్తుంది. మంచి నిద్ర వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు పోతాయి. అలాగే, ఆరోగ్యంగా కూడా ఉంటారు.
ఒత్తిడిని తగ్గించుకోండి
ఒత్తిడి నియంత్రించాలంటే ధ్యానం, ప్రాణాయామం వంటివి ప్రయత్నించండి. మీకు ఇష్టమైన పనులకు కొంత సమయం కేటాయించండి. సానుకూల ఆలోచనలు మనసును ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి.
చర్మ సంరక్షణ
ఇంటి నుంచి బయటకు వెళ్తే తప్పనిసరిగా సన్‌స్క్రీన్ రాసుకోండి. వారానికి ఒక్కసారి ఫేస్ ప్యాక్, స్క్రబ్ వంటివి ఉపయోగించండి. ఇంట్లో తయారుచేసే చర్మ సంరక్షణ పద్ధతులు కూడా ఉపయోగించండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
తరచుగా ఆవలిస్తుంటే జాగ్రత్త.. మీ శరీరం చెప్పే ఆరోగ్య సంకేతాలు ఇవే!
మీరు ఆఫీస్‌కి వెళ్తారా..? తాజా సర్వేలో సంచలన విషయాలు..
For More Health News
Updated Date - Jun 29 , 2025 | 03:00 PM