ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: ఎన్డీయే విజయోత్సాహం.. పార్టీ ప్రధానకార్యాలయానికి మోదీ

ABN, Publish Date - Nov 14 , 2025 | 02:29 PM

విజయోత్సవ వేళ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి ప్రధాన మంత్రి మోదీ సాయంత్రం 6 గంటలకు విచ్చేయనున్నారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

PM Modi

న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే 200 సీట్లకు చేరువలో అఖండ విజయం నమోదు చేసుకోనుండటం, ఆ రాష్ట్రంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడం ఖాయం కావడంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు మిన్నంటుతున్నాయి. విజయోత్సవ వేళ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సాయంత్రం 6 గంటలకు విచ్చేయనున్నారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకూ ఈసీఐ వెబ్‌సైట్ గణాంకాలను బట్టి 197 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 89 సీట్లలో గెలుపు ఖాయం చేసుకుంది. జేడీయూ 89, చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ (రామ్‌విలాస్) 21 సీట్లలోనూ గెలుపు ఖరారు చేసుకున్నాయి. రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహ ఆర్ఎల్ఎం, కేంద్ర మంత్రి జితిన్ రామ్ మాంఝీ హెచ్ఏఎం (సెక్యూలర్) చెరో 4 సీట్లలో ఆధిక్యత కొనసాగిస్తున్నాయి.

ఎన్డీయే హవాలో విపక్ష మహాగఠ్‌బంధన్ కొట్టుకుపోయినట్టు ఫలితాలు వెలువడుతున్నాయి. రాష్ట్రీయ జనతా దళ్ 30 సీట్లలో గెలుపు అవకాశాలను పదిలం చేసుకోగా, కాంగ్రెస్, వీఐపీ పార్టీలు ఖాతా తెరవడమే కష్టంగా ఉన్నట్టు ట్రెండ్స్ వెలువడుతున్నాయి. సీపీఐ ఎంఎల్ నాలుగు స్థానాల్లోనూ, సీపీఎం ఒక సీటులోనూ ఆధిక్యం కొనసాగిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి..

ఆపేదెవరు.. బీహార్‌లో నితీశ్ ఏకఛత్రాధిపత్యం..

బిహార్‌లో గెలుపు మాదే.. ఇక బెంగాల్‌లోనూ..: కేంద్ర మంత్రి

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 14 , 2025 | 02:34 PM