Congress MLA Jare Adinarayana: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వినూత్న ప్రచారం..
ABN, Publish Date - Nov 06 , 2025 | 06:38 PM
అశ్వారావు పేట కాంగ్రెస్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన చాలా వినూత్నంగా ప్రచారం చేశారు. చికెట్ కొట్టి, పాడ పాడారు.
అన్ని ప్రధాన పార్టీలకు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఎన్నిక తేదీ దగ్గరపడుతుండటంతో హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ తరఫున వీ నవీన్ యాదవ్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్నారు. జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక, నవీన్ యాదవ్‌కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం చురుగ్గా ప్రచారంలో పాల్గొంటున్నారు. నిన్న (బుధవారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. తమ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు.
ఎమ్మెల్యే వినూత్న ప్రచారం..
అశ్వారావు పేట కాంగ్రెస్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన చాలా వినూత్నంగా ప్రచారం చేశారు. ప్రచారం సందర్భంగా ఓ చికెన్ షాపులో ఆయన సందడి చేశారు. చికెన్ కొట్టడంతో పాటు చికెన్‌పై పాట పాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ‘కొయ్యక కొయ్యక నేను కోడిని కోసి వండుకుంటే..’ అని పాట సాగుతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఎమ్మెల్యే పాటపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ప్లీజ్.. నాకు హెల్ప్ చెయ్యండి.. వీధి కుక్క హాస్పిటల్‌కు వచ్చి ఏం చేసిందో చూడండి..
బీహార్ డిప్యూటీ సీఎంపై దాడి.. పోలింగ్ రోజు హింసాత్మక ఘటనలు..
Updated Date - Nov 06 , 2025 | 07:45 PM