ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nitish kumar Viral Video: బీజేపీ మహిళా అభ్యర్థి మెడలో నితీష్ దండ.. తేజస్వి సెటైర్

ABN, Publish Date - Oct 21 , 2025 | 06:48 PM

నితీష్ ఆరోగ్యంపై తేజస్వి కామెంట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రధాని మోదీ కార్యక్రమంలో నితీష్ కుమార్ తన నివాసం నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. టీవీ స్క్రీన్‌లో మోదీ వైపు చూస్తూ తన రెండు చేతులను జోడిస్తూ నితీష్ ఉండిపోయారు.

Bihar Assembly Elections

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) బీజేపీకి చెందిన మహిళా అభ్యర్థి మెడలో పూలదండ వేసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. నితీష్ మానసిక స్థితిపై తరచు విమర్శలు గుప్పించే ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వెంటనే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆయనపై సెటైర్లు గుప్పించారు. 'వాట్ ఏ క్రేజీ గై హి ఈజ్, బ్రో!!' అని కామెంట్ చేస్తూ ఆ వీడియాను షేర్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. మంగళవారంనాడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార ర్యాలీలో వేదికపై నితీష్ కుమార్‌తో పాటు జేడీ(యూ) ఎంపీ సంజయ్ ఝా, బీజేపీ అభ్యర్థి రామా నిషాద్ తదితరులు పాల్గొన్నారు. సంజయ్ ఝా ఒక పూలదండను నితీష్‌కు ఇచ్చి ఆయన చేతుల మీదుగా రామా నిషాద్‌కు ఇవ్వమన్నారు. నితీష్ ఆ దండను ఆమె మెడలో వేసే ప్రయత్నం చేయడంతో ఝా అడ్డుకున్నారు. నితీష్ వెంటనే ఆ దండను ఆమె చేతి వరకూ తీసుకువచ్చి చటుకున్న ఆమె మెడలో వేశారు. సంజయ్ ఝాను ఉద్దేశించి 'గజబ్ ఆద్మీ హై' అంటూనే.. నేనెందుకు ఆమె చేతికి దండ ఇవ్వాలి? అని నవ్వుతూ ప్రశ్నించారు. దీంతో రామా నిషాద్‌తో పాటు అక్కడున్న వారంతా హాయిగా నవ్వుకోవడం కనిపించింది.

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నితీష్ కుమార్‌పై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వీడియోను తేజస్వి షేర్ చేస్తూ.. 'వాట్ ఏ క్రేజీ గై హి ఈజ్, బ్రదర్.. ముఖ్యమంత్రి గారూ.. మీ ఆరోగ్యం బాగుంటే రాసిచ్చిన స్పీచ్ ఎందుకు చదువుతున్నారు?' అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సైతం ఈ వీడియోను షేర్ చేసింది. ఒక వ్యక్తి ఆరోగ్యం గురించి కామెండ్ చేయడం సరికాదంటూనే.. నిజంగానే నితీష్ కుమార్ ఆరోగ్యం బాగోలేదా? అంటూ ట్వీట్ చేసింది.

నితీష్ ఆరోగ్యంపై తేజస్వి కామెంట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రధాని మోదీ కార్యక్రమంలో నితీష్ కుమార్ తన నివాసం నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. టీవీ స్క్రీన్‌లో మోదీ వైపు చూస్తూ తన రెండు చేతులను జోడిస్తూ నితీష్ ఉండిపోయారు. ఆ వీడియోను తేజస్వి షేర్ చేస్తూ.. నితీష్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నారన్నది చాలా స్పష్టంగా కనిపిస్తోందంటూ విమర్శించారు. నితీష్ మానసిక పరిస్థితికి ఆయన సన్నిహితులే కారణమా అని ఆ పోస్టులో ప్రశ్నించారు. నితీష్ ఆహారంలో వారు ఏదో కలుపుతున్నట్టున్నారని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి..

విభేదాల వేళ సీఎం, డిప్యూటీ సీఎంను కలిసిన కిరణ్ మజుందార్

12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 21 , 2025 | 06:49 PM