ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bihar Elections 2025: భారీ పోలింగ్‌‌తో ఎవరికి డేంజర్.. గత ఫలితాలు ఏమి చెప్పాయంటే

ABN, Publish Date - Nov 07 , 2025 | 06:11 PM

ప్రస్తుత ఎన్నికల ఫలితాలు ఏవిధంగా ఉండవచ్చనే దానిపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 2010లో నితీష్ ఎంత బలంగా ఉన్నారో అదేవిధంగా ఈసారి నితీష్ బలపడే అవకాశాలున్నాయని కొందరి అంచనాగా ఉంది.

Bihar Elections

పాట్నా: ప్రజాస్వామ్య పండుగలో పెద్దఎత్తున ఓటర్లు పాల్గొనాలని పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో ఊదరగొడుతుంటాయి. పోలింగ్ అనంతరం ఓటింగ్ సరళి తమకు అనుకూలంగా ఉందని పార్టీలు క్లెయిమ్ చేసుకోవడం కూడా రివాజే. తాజాగా దేశ ప్రజల దృష్టి అంతా బిహార్ ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి. నవంబర్ 6న 121 నియోజకవర్గాలకు జరిగిన తొలి విడత పోలింగ్‌లో రికార్డు స్థాయిలో 64.65 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించారు. ఇదే ఊపు రెండో విడతలోనూ కొనసాగితే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి. గత ఎన్నికల్లో ఓటింగ్ శాతం, అది ప్రభుత్వాల తలరాతను ఎలా మార్చిందనే దానిపై ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం 55.68గా నమోదైంది. మూడు విడతలుగా పోలింగ్ జరిగింది. తొలి విడత 71 సీట్లలో పోలింగ్ జరిగింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బిహార్‌లో 17 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. పోలింగ్ శాతం 5 కంటే పెరిగినా, తగ్గినా కూడా అధికార మార్పిడి జరిగినట్టు బిహార్‌ ఎన్నికల చరిత్ర చెబుతోంది.

ఎలక్టోరల్ హిస్టరీ

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల చరిత్రను ఓసారి చూస్తే.. 1951లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 39.5 శాతం పోలింగ్ నమోదు కాగా, కాంగ్రెస్ గెలిచింది. 1957లో 41.3 శాతం పోలింగ్‌తో కాంగ్రెస్ అధికారం నిలుపుకొంది. 1962లో 44.5 శాతం పోలింగ్‌తో తిరిగి కాంగ్రెస్ గెలిచింది. 1967లో 51.5 శాతం పోలింగ్ జరిగింది. ఆ ప్రకారం 7 శాతం పోలింగ్ పెరిగింది. జన్ క్రాంతి దళ్ సారథ్యంలో కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 1969లో 52.8 శాతంతో అస్థిర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో 1972లో జరిగిన ఎన్నికల్లో 52.8 శాతం పోలింగ్‌ జరిగి కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఎమర్జెన్సీ నడిచింది. 1977లో 50.5 శాతం పోలింగ్‌తో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1980లో 57.3 శాతం పోలింగ్ జరిగి తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 1985లో 56.3 శాతం పోలింగ్‌తో కాంగ్రెస్ గెలిచింది. 1990లో 62 శాతం పోలింగ్ జరిగి జనతాదళ్ అధికారంలోకి వచ్చింది. లాలూ ప్రసాద్ ముఖ్యమంత్రి అయ్యారు. 1995లో 61.8 శాతం పోలింగ్ జరిగి ఆర్జేడీ తిరిగి అధికారం నిలబెట్టింది. 2000లో 62.6 శాతం పోలింగ్ జరిగి ఆర్జేడీ పదవిలో కొనసాగింది. 2005లో 46.5 శాతం పోలింగ్ జరిగి ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ ఏడాది రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగి రాష్ట్రపతి పాలనకు దారితీస్తే, అక్టోబర్ ఎన్నికల్లో నితీష్ కుమార్ సీఎం అయ్యారు. 2010లో 52.7 శాతం పోలింగ్ జరిగి ఎన్డీయే అధికారం నిలబెట్టుకుంది. 2015లో 56.7 శాతం పోలింగ్ జరిగింది. ఆర్జేడీ, కాంగ్రెస్, జేడీ(యూ) లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. 2020లో 56.9 శాతం పోలింగ్ జరగి ఎన్డీయే తిరిగి అధికారంలోకి వచ్చింది.

ప్రధానంగా 1967, 1980, 1990, 2005 ఎన్నికలు బిహార్ రాజకీయాల్లో నాటకీయ మలుపులు చోటుచేసుకున్నాయి. 1967లో 7 శాతం పోలింగ్ పెరిగి తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కొద్దికాలమే అధికారంలో ఉంది. 1980లో 6.8 శాతం పోలింగ్ పెరిగి కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. 1990 ఎన్నికల్లో ఓటింగ్ శాతం 5.8 పెరిగింది. కాంగ్రెస్ పాలన ముగిసి లాలూప్రసాద్ శకం మొదలైంది. 2005లో పోలింగ్ శాతం 16.1 శాతం తగ్గింది. దీంతో 15 ఏళ్ల లాలూ-రబ్రీ పాలనకు తెరపడింది. నితీష్ కుమార్ అధికారంలోకి వచ్చారు. అక్కడి నుంచి 20 ఏళ్ల పాటు సీఎంగా ఆయన కొనసాగుతూ వచ్చారు.

ఇలా జరగొచ్చు..

ప్రస్తుత ఎన్నికల ఫలితాలు ఏవిధంగా ఉండవచ్చనే దానిపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 2010లో నితీష్ ఎంత బలంగా ఉన్నారో అదేవిధంగా ఈసారి నితీష్ బలపడే అవకాశాలున్నాయని కొందరి అంచనాగా ఉంది. ఛాత్ పండుగ కోసం స్వరాష్ట్రానికి ఓటర్లు వచ్చిన సమయంలోనే ఎన్నికలు చోటుచేసుకోవడం ఓటింగ్ శాతం పెరగడానికి ప్రధాన కారణమని అంటున్నారు. పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి అనూకూలంగా ఉంటుందనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నితీష్ తన పట్టు కొనసాగించనున్నారా, అంతర్గత విభేదాల ప్రభావంపై తేజస్విపై పడే అవకాశం ఉందా, ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ శక్తిగా ఎదుగుతారా అనేది చర్చనీయాంశాలవుతున్నాయి. అయితే రెండో విడత పోలింగ్ సరళి పైనే ప్రభుత్వంలో మార్పులు, కూటముల భవిష్యత్‌ నిర్ధారణయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

వందేమాతర 150వ వార్షికోత్సవం.. ప్రత్యేక నాణెం, స్టాంపు విడుదల

బీజేపీ, ఈసీ కలిసి రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయి..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 07 , 2025 | 06:21 PM