VITEEE 2026: వీఐటీఈఈఈ 2026 కోసం దరఖాస్తుల ఆహ్వానం
ABN, Publish Date - Oct 25 , 2025 | 05:10 AM
ఫ్లాగ్‌షిప్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశానికి వేలూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీఐటీ) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
చెన్నై, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఫ్లాగ్‌షిప్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశానికి వేలూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీఐటీ) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వీఐటీఈఈఈ-2026 పేరిట నిర్వహించనున్న పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు వేలూరు, చెన్నై, అమరావతి, భోపాల్‌లోని వీఐటీ ప్రాంగణాల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఠీఠీఠీ.ఠిజ్ట్ఛ్ఛ్ఛీ.ఠిజ్టీ.్చఛి.జీుఽ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచని పేర్కొన్నారు. దేశంలోని 134 నగరాలు, 9 అంతర్జాతీయ పరీక్షా కేంద్రాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 28 నుంచి మే 3వ తేదీ వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు తమకు దగ్గరగా ఉన్న ఏదో ఓ కేంద్రాన్ని ఎంచుకోవచ్చని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో, అద్భుతమైన ప్లేస్‌మెంట్ అవకాశాలతో ఇంజనీరింగ్ విద్యకు కేరాఫ్‌గా వీఐటీ నిలుస్తోందని వివరించారు. తమ కలల కేరీర్ వైపు అడుగులు వేయాలనుకునే విద్యార్థులకు ఇది సువర్ణ అవకాశమని పేర్కొన్నారు.
Updated Date - Oct 25 , 2025 | 05:10 AM