ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IB Recruitment 2025: ఐబీలో ఉద్యోగాలు.. నెలకు లక్షా 42 వేల జీతం, అప్లై చేశారా లేదా..

ABN, Publish Date - Jul 16 , 2025 | 03:10 PM

మీరు కేంద్ర ప్రభుత్వంలో మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా. అయితే మీకు శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు నెలకు రూ.లక్షా 42 వేల వరకు జీతం ఉంది.

IB Recruitment 2025

నిరుద్యోగులగు గుడ్ న్యూస్ వచ్చేసింది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) 3,717 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) గ్రేడ్-II పోస్టులకు నోటిఫికేషన్‌ (IB Recruitment 2025) విడుదల చేసింది. ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది. జీత భత్యాలు ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

మూడు దశల్లో ఎంపిక..

ఈ నోటిఫికేషన్ ద్వారా 3,717 ACIO గ్రేడ్-II ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద ఉంటాయి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 19, 2025 నుంచి ప్రారంభమై, ఆగస్టు 10, 2025 వరకు కొనసాగుతుంది. ఈ పోస్టుల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. టైర్I (ఆబ్జెక్టివ్ టెస్ట్), టైర్-II (డిస్క్రిప్టివ్ టెస్ట్), ఇంటర్వ్యూ. ఈ మూడు దశల్లో ఎంపికైన అభ్యర్థులకు ప్రాథమిక వేతనం నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు లభిస్తుంది.

ముఖ్యమైన తేదీలు

  • నోటిఫికేషన్ విడుదల: జులై 14, 2025

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: జులై 19, 2025

  • దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 10, 2025

  • పరీక్ష తేదీ: త్వరలో ప్రకటించబడుతుంది

అర్హత ప్రమాణాలు

ACIO పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ mha.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.

వయస్సు పరిమితి (ఆగస్టు 10, 2025 నాటికి):

  • కనీస వయస్సు: 18 సంవత్సరాలు

  • గరిష్ఠ వయస్సు: 27 సంవత్సరాలు

ఖాళీల వివరాలు

  • UR: 1,537

  • OBC: 946

  • SC: 566

  • ST: 226

  • EWS: 442

దరఖాస్తు ఫీజు:

  • జనరల్/OBC/EWS: రూ.100

  • SC/ST/మహిళలు/ఎక్స్-సర్వీస్‌మెన్: ఉచితం

ఎలా అప్లై చేయాలి

  • అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ సందర్శించి ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. దరఖాస్తు చేయడానికి ఈ దశలను పాటించాలి.

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ mha.gov.inని సందర్శించండి.

  • హోమ్‌పేజీలో IB ACIO 2025 దరఖాస్తు ఫారమ్‌పై క్లిక్ చేయండి

  • అవసరమైన సమాచారాన్ని పూర్తి చేసి, సంబంధిత డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి

  • దరఖాస్తు ఫీజు చెల్లించి, సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి

సిలబస్ & పరీక్షా విధానం

IB ACIO పరీక్ష సిలబస్‌లో జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ స్టడీస్ వంటి సబ్జెక్టులు ఉంటాయి.

ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 16 , 2025 | 03:13 PM