ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

SSC certificate correction: మీ టెన్త్ సర్టిఫికెట్‌లో తప్పులున్నాయా? ఇలా మార్చుకోండి..

ABN, Publish Date - Oct 06 , 2025 | 08:45 AM

విద్యార్థుల జీవితంలో పదో తరగతి సర్టిఫికెట్ కీలక పాత్ర పోషిస్తుంది. చాలా సందర్భాల్లో పుట్టిన తేదీకి పదో తరగతి సర్టిఫికెట్‌నే ప్రామాణికంగా తీసుకుంటారు. అలాంటి సర్టిఫికెట్‌‌లోనే తప్పులు ముద్రితమైతే ఏం చేయాలి. పదో తరగతి సర్టిఫికెట్‌లో తప్పులుంటే మార్చుకునే వీలుంది.

change date of birth in SSC certificate

విద్యార్థుల జీవితంలో పదో తరగతి సర్టిఫికెట్ కీలక పాత్ర పోషిస్తుంది. చాలా సందర్భాల్లో పుట్టిన తేదీకి పదో తరగతి సర్టిఫికెట్‌నే ప్రామాణికంగా తీసుకుంటారు. అలాంటి సర్టిఫికెట్‌‌లోనే తప్పులు ముద్రితమైతే ఏం చేయాలి. పదో తరగతి సర్టిఫికెట్‌లో తప్పులుంటే మార్చుకునే వీలుంది. అయితే పదో తరగతి ఫలితాలు విడుదలైన నాటి నుంచి మూడేళ్ల లోపు మాత్రమే సర్టిఫికెట్‌లోని తప్పులను సవరించుకునే వీలుంటుంది (change date of birth in SSC certificate).

ముందుగా విద్యార్థి చదివిన పాఠశాల హెడ్మాస్టర్ ధ్రువీకరణతో ఎంఈవో దగ్గరకు వెళ్లాలి (DOB correction SSC). అక్కడ కూడా ధ్రువీకరణ పూర్తి చేసుకుని పాఠశాల విద్యా సంచాలకుడి దగ్గరకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. స్కూల్ రిజిస్టర్‌లో నమోదైన పుట్టిన తేదీకి భిన్నంగా పదో తరగతి సర్టిఫికెట్‌లో ఉంటే విద్యా సంచాలకుడు మార్పునకు ఆమోదం తెలుపుతారు. అప్పుడు ఎస్‌ఎస్‌సీ బోర్డ్ అధికారులు పుట్టిన తేదీని మార్చి కొత్త సర్టిఫికెట్ ఇస్తారు. ఇందుకోసం ఎటువంటి ఫీజునూ కట్టనక్కర్లేదు.

పుట్టిన తేదీ మాత్రమే కాదు.. ఇంటి పేరు, విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు తప్పుగా ముద్రితమైనా సరే ఇదే పద్ధతిని అవలంబించాలి (SSC Certificate correction). ఎటువంటి ఫీజూ తీసుకోకుండా అధికారులే సరిచేస్తారు. ఇలా తప్పులను సవరించుకునేందుకు ఏటా దాదాపు పదిహేను వందల మంది విద్యార్థులు ఎస్‌ఎస్‌సీ బోర్డ్ దగ్గరకు వెళుతుంటారట.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 06 , 2025 | 09:29 AM