Offer Plan: రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా సహా
ABN , Publish Date - Sep 26 , 2025 | 10:36 AM
దేశంలో టెలికాం యూజర్లను ఆకట్టుకునేందుకు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) సరికొత్త ఆఫర్ ప్రకటించింది. 72 రోజుల అన్‌లిమిటెడ్ ప్లాన్ మీకు తక్కువ ధరల్లో అంటే రూ.485కే లభిస్తుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
దేశవ్యాప్తంగా టెలికాం వినియోగదారులను ఆకర్షించేందుకు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఎక్కువ డేటా, కాలింగ్ ప్రయోజనాలతో ఖర్చు పెరుగుతుందని అనుకునే వారికి మంచి ఛాన్స్ వచ్చింది. కేవలం రూ.485కే 72 రోజుల పాటు అన్‌లిమిటెడ్ ప్రయోజనాలను పొందవచ్చు.
తక్కువ ధరల్లో ఎక్కువ సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ప్లాన్ ప్రకటించారు. ఈ ప్లాన్ విషయంలో BSNL ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో మంచి నెట్‌వర్క్ కలిగిన BSNL, ఈ ప్లాన్ ద్వారా మరింత మంది వినియోగదారులను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.
అనేక ప్రయోజనాలు
ఈ 4G సేవల ప్రారంభానికి ముందే, బీఎస్‌ఎన్‌ఎల్ 72 రోజుల ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈ ప్లాన్ వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
అన్‌లిమిటెడ్ కాలింగ్: భారతదేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు
ఫ్రీ రోమింగ్: దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉచిత రోమింగ్ సౌకర్యం
2GB డైలీ డేటా: రోజుకు 2GB హై స్పీడ్ డేటా, మొత్తం 72 రోజులకు 144GB
100 SMS రోజూ: ప్రతి రోజు 100 ఉచిత SMSలు లభిస్తాయి
డిస్కౌంట్ కూడా..
సెప్టెంబర్ 27 నుంచి దేశవ్యాప్తంగా అన్ని టెలికాం సర్కిల్‌లలో 4G సేవలను ప్రారంభించనున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ తన అధికారిక X హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఒక సంవత్సరం పాటు 1,00,000 కొత్త 4G/5G టవర్‌లను స్థాపించిన ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ 4G సేవలు వినియోగదారులకు వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడంతో పాటు కాల్ డిస్‌కనెక్షన్ సమస్యలను గణనీయంగా తగ్గించనున్నాయి.
ఈ ప్లాన్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ BiTV సేవ కూడా ఉచితంగా అందుబాటులో ఉంది. ఈ సేవలో 300కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌లు, OTT యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ అక్టోబర్ 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది. దీంతోపాటు బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా రీచార్జ్ చేసే వినియోగదారులకు 2% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి