ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Civils Strategy: సివిల్స్‌లో వైఫల్యం.. అభ్యర్థులు ఎక్కువగా చేసే 6 పొరపాట్లు

ABN, Publish Date - Dec 21 , 2025 | 03:00 PM

సివిల్స్ ప్రిపరేషన్‌లో వైఫల్యాలు ఎదుర్కునే వారు సాధారణంగా చేసే కొన్ని తప్పులు ఉన్నాయి. అవేంటో తెలుసుకుని సరిదిద్దుకుంటే కచ్చితంగా విజయం వరిస్తుంది. మరి ఈ మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

Civils Strategy

ఇంటర్నెట్ డెస్క్: ఏటా వేల మంది సివిల్స్ పరీక్షకు హాజరవుతుంటారు. కానీ చాలా మందికి విజయం అందని ద్రాక్షగానే మిగులుతుంది. మరికొందరేమో.. ఒకటి రెండు మార్కుల తేడాతో అద్భుత భవిష్యత్తుకు దూరమవుతారు. ఇలాంటి వారు సాధారణంగా కొన్ని పొరపాట్లు చేస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. పరీక్ష సన్నద్ధమయ్యే క్రమంలో అవగాహనలేమితో చేసే పొరపాట్లే ఈ పరిస్థితికి కారణమని చెబుతున్నారు (Civils Aspirants - Mistakes). మరి ఈ పొరపాట్లు ఏంటంటే..

ప్రిలిమ్స్ అంటే కచ్చితత్వానికి సంబంధించిన పరీక్ష. కానీ కొందరు అధికంగా ప్రశ్నలకు సమాధానాలు పెట్టి నెగెటివ్ మార్కులు తెచ్చుకుని వెనకబడుతుంటారు. పలు మాక్ టెస్టులు రాసుకుని పరీక్షకు సన్నద్ధమైతే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. రిస్కీ ప్రశ్నలు ఏవో తెలిసి వాటికి దూరంగా ఉండటం సాధ్యం అవుతుంది.

పోటీ పరీక్ష ఏదైనా ముందుగా సిలబస్‌పై అవగాహన తప్పనిసరి. కానీ కొందరు సబ్జెక్టులను వేర్వేరుగా చదువుతూ వాటిని లాజికల్‌గా అనుసంధానించాల్సిన విషయాన్ని మర్చిపోతారు. చివరకు లోతైన సమాధానాలు రాయలేక చివరకు పరీక్షలో విఫలం అవుతారు.

కొందరు ప్రశ్న పత్రం డిజైన్‌లో వస్తున్న మార్పులను పట్టించుకోరు. అసలు ప్రశ్నలను ఎలా రూపొందిస్తున్నారో అర్థం చేసుకోరు. ఇప్పటికే అభిప్రాయాలు, అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలు పెరుగుతున్నాయి. దీంతో, లోతైన అవగాహన లేని వారు ఇలాంటి ప్రశ్నలను అర్థం చేసుకోలేక బోల్తాపడుతుంటారు.

అద్భుతమైన లోతైన సమాధానాలు రాయాలంటే ప్రాక్టీస్ తప్పనిసరి. లేకపోతే ఇంట్రొడక్షన్, కాంక్లూషన్ సరిగా లేక ఇబ్బంది పడతారు. కాబట్టి అభ్యర్థులు తమ సమాధాలను నిపుణులతో ముదింపు వేయించుకుని వారి సలహాల మేరకు మార్పులు చేయాలి.

మంచి స్కోరు సాధించేందుకు ఆప్షనల్ సబ్జెక్టు చాలా కీలకమన్న విషయం మర్చిపోకూడదు. చాలా మంది ఇందులో మంచి స్కోరు సాధించలేక అంతిమంగా వెనకబడుతున్నారు. ఫైనల్ లిస్టుకు అర్హత సాధించలేకపోవడానికి ఇదీ ఒక ప్రధాన కారణం.

కొందరు ఏళ్ల తరబడి ప్రీపేర్ అవుతూ మానసిక అలసటకు లోనవుతారు. మునుపటి ఉత్సాహం, ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. విషయాలు త్వరగా గుర్తుకు రావు. కాబట్టి, ఇలాంటి వారు చదువుకు నుంచి క్రమం తప్పకుండా విరామం తీసుకుంటూ ఉత్సాహాన్ని మళ్లీ కూడగట్టుకుని ముందుకు వెళితే మంచి ప్రయోజనం ఉంటుంది.

ఇవీ చదవండి

స్కిల్‌ గ్యాప్‌ని తగ్గించేసీడాక్‌ కోర్సులు

ఫ్యాషన్ డిజైన్ కోర్సులు.. సృజనాత్మకతకు చిరునామా

Updated Date - Dec 22 , 2025 | 07:14 AM