Share News

C DAC Programs: స్కిల్‌ గ్యాప్‌ని తగ్గించేసీడాక్‌ కోర్సులు

ABN , Publish Date - Dec 22 , 2025 | 04:13 AM

డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ దిశగా భారతదేశం దూసుకెళుతోంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, సెమికండక్టర్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, డేటా నిర్దేశిత టెక్నాలజీలు వేగంగా .....

C DAC Programs: స్కిల్‌ గ్యాప్‌ని తగ్గించేసీడాక్‌ కోర్సులు

డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ దిశగా భారతదేశం దూసుకెళుతోంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, సెమికండక్టర్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, డేటా నిర్దేశిత టెక్నాలజీలు వేగంగా పుంజుకుంటున్న రోజులు ఇవి. మిలియన్ల కొద్దీ ఉద్యోగ అవకాశాలను ఈ పరిణామాలు కల్పిస్తున్నాయి. అదే సమయంలో సరికొత్త సవాళ్ళనూ విసురుతున్నాయి. అయితే ఈ క్రమంలో ఇండస్ట్రీ కోరుకుంటున్న నైపుణ్యాలు కలిగిన యువత మాత్రం లభ్యం కావటం లేదు. ఫలితంగా అటు అవసరాలు, ఇటు నైపుణ్యం కలిగిన మానవవనరుల మధ్య అంతరం పెరుగుతోంది.

మన దేశంలో ఏటా లక్షన్నరకు మించి ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు వివిధ సంస్థల నుంచి ఉత్తీర్ణులవుతున్నారు. అయితే అందులో పరిశ్రమకు అచ్చంగా ఉపయోగపడే నైపుణ్యాలు కలిగిన వారు మాత్రం తక్కువ శాతంగానే ఉంటున్నారు. దాంతో ఆ గ్రాడ్యుయేట్లు ఉద్యోగం కోసం ప్రయాసపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలాఉంటే టెక్నాలజీపరంగా అత్యున్నత ఎదుగుదల ఉన్న డొమైన్లు పలు సాంకేతిక పరిజ్ఞాన రంగాల కలయికగా మారి పటిష్టమైన కెరీర్‌ డ్రైవర్లుగా మారుతున్నాయి. వాటిలో ముఖ్యంగా....

అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌: నేషనల్‌ కంప్యూటింగ్‌ మిషన్‌ వంటివి కంప్యూటింగ్‌ అత్యున్నత ప్రతిభ కలిగిన వారిని డిమాండ్‌ చేస్తున్నాయి. దానికితోడు ఏఐ ఇంటిగ్రేషన్‌, డిస్ట్రిబ్యూటెడ్‌ సిస్టమ్స్‌, డేటా ఇంజనీరింగ్‌, ఎంరట్రప్రైజ్‌ వెబ్‌ అప్లికేషన్‌ డెవల్‌పమెంట్‌ను డిమాండ్‌ చేస్తోంది.

ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ అండ్‌

వీఎల్‌ఎ్‌సఐ: సెమికాన్‌ ఇండియా ప్రోగ్రామ్‌ కింద మన దేశం అందిస్తున్న ప్రోత్సాహంతో లక్షల కోట్లు పెట్టుబడులు ఈ రంగంలో జమ అవుతున్నాయి. ఎంబెడెడ్‌ సాఫ్ట్‌వేర్‌ చిప్‌ డిజైన్‌, వెరిఫికేషన్‌, ఎస్‌ఓసీ డెవల్‌పమెంట్‌ నైపుణ్యాలు ఉన్న వ్యక్తులు దానికి అవసరమవుతారు.

సైబర్‌ సెక్యూరిటీ: బ్యాంకింగ్‌, టెలికామ్‌, ప్రభుత్వం, రక్షణ తదితర రంగాల్లో డిజిటల్‌ అడాప్షన్‌ పెరుగుతున్న కొద్దీ సైబర్‌ సెక్యూరిటీ క్లిష్టంగా మారుతోంది. అయితే మన దేశం ఇప్పుడు సరైన నైపుణ్యాలు కలిగిన సైబర్‌ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్‌ కొరతను ఎదుర్కొంటోంది.


ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ బిగ్‌ డేటా

అనలిటిక్స్‌: ఎఐ, డేటా అనలిటిక్స్‌ ఇప్పుడు పరిశ్రమల స్వరూపస్వభావాలనే మార్చేస్తున్నాయి. హెల్త్‌కేర్‌, ఫిన్‌టెక్‌ నుంచి తయారీ పరిశ్రమలు, ఈ-కామర్స్‌ వరకు అన్నింటా ఏఐ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు డిమాండ్‌ పెరుగుతోంది.

అయితే సరైన ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ కొరవడిన కారణంగా ఇండస్ట్రీ అంచనాలతో పోల్చుకుంటే 30 నుంచి 50 శాతం మేర సంబంధిత శిక్షణ పొందిన మానవవనరుల కొరత కనిపిస్తోంది. సరిగ్గా ఈ నేపథ్యంలో ప్రాక్టికల్‌ స్కిల్స్‌ పెంపుపై పరిశ్రమలు దృష్టిసారించేలా చేస్తోంది. సదరు సవాళ్ళను సమర్థంగా ఎదుర్కొనే నైపుణ్యం కలిగిన మానవవనరులను రూపొందించేందుకు సీడాక్‌ వివిధ పోస్టుగ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లను రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పరిధిలో పని చేస్తున్న స్వతంత్రప్రతిపత్తి కలిగిన సంస్థ సెంటర్‌ ఫర్‌ డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(సీడాక్‌). ముందుగా పేర్కొన్న అవసరాలకు తగిన విధంగా రూపొందించిన పీజీ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ల్లో అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ డిజైన్‌, వీఎల్‌ఎ్‌సఐ డిజైన్‌, సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ సెక్యూర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవల్‌పమెంట్‌, బిగ్‌ డేటా అనలిటిక్స్‌, ఐటీ ఇన్ర్ఫాస్ట్రక్చర్‌ సిస్టమ్స్‌ అండ్‌ సెక్యూరిటీ తదితరాలు ఉన్నాయి. ఇవన్నీ 24 వారాల ప్రోగ్రామ్‌లు. లెర్నింగ్‌, ఎక్స్‌టెన్సివ్‌ ల్యాబ్‌ వర్క్‌, రియల్‌ వరల్డ్‌ ప్రాజెక్టులకుతోడు అనుభవజ్ఞులైన సైంటిస్టులు, ఇంజనీర్లు, ఇండస్ట్రీ నిపుణులతో లెక్చరర్లు కలగలిసిన కార్యక్రమంగా ఈ ప్రోగ్రామ్‌లను సీడాక్‌ తీర్చిదిద్దింది. 1200 గంటలకు మించి కఠినమైన ట్రైనింగ్‌ ఉంటుంది. దాంతో హ్యాండ్స్‌ అన్‌ ఎక్స్‌పోజర్‌కు అవకాశం ఉంటుంది. అందులో బాగంగా ఇండస్ట్రీ టూల్స్‌, టెక్నాలజీలు, బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ అలవడతాయి. దానికి తోడు టెక్నికల్‌ స్కిల్స్‌ నేర్చుకుంటారు. ఆప్టిట్యూడ్‌, కమ్యూనికేషన్‌, ప్లేస్‌మెంట్‌ రెడీనెస్‌ సహా ప్రొఫెషనల్‌ కార్యకలాపాల్లోకి నేరుగా చేరే విధంగా ఈ కోర్సులో చేరిన విద్యార్థులను తీర్చిదిద్దుతారు. అత్యున్నత ఎదుగుదల కలిగిన రంగాల్లో మంచి వేతనాలతో ప్రొఫెషనల్స్‌గా నిలదొక్కుకోగలుగుతారు. సంబంధిత నైపుణ్యాలను అలవర్చుకోవడం అన్నది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు ఇప్పుడు ఆప్షన్‌ ఎంత మాత్రం కాదు, అది అవసరమే అని గుర్తించాలి.

- డాక్టర్‌ పి.ఆర్‌. లక్ష్మీ ఈశ్వరి, సైంటిస్ట్‌ ‘జి’ అండ్‌ సెంటర్‌ హెడ్‌, సీడాక్‌, హైదరాబాద్‌.

సీడాక్‌ అందిస్తున్న వివిధ పీజీ సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశానికి వచ్చే ఏడాది జనవరి 10, 11 తేదీల్లో కామన్‌

అడ్మిషన్‌ టెస్ట్‌ జరుగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న సీడాక్‌ సెంటర్లలో ఈ టెస్ట్‌ను నిర్వహిస్తున్నారు.

అర్హతలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్‌ 29లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్స్‌: www.cdac.in or acts.cdac.in

Updated Date - Dec 22 , 2025 | 04:13 AM