CDAC Recruitment 2025: సీడాక్‌లో ఉద్యోగాలు.. అప్లికేషన్ ఫీజు లేదు, ఏడాదికి రూ. 18 లక్షల జీతం
ABN, Publish Date - Jul 09 , 2025 | 03:47 PM
టెక్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. దేశంలో ప్రముఖ పరిశోధనా సంస్థలలో ఒకటైన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC Recruitment 2025) 280కి పైగా ఖాళీలను అనౌన్స్ చేసింది. అయితే వీటి అర్హతలు ఏంటి, ఎలా అప్లై చేయాలనే విషయాల గురించి ఇప్పుడు చూద్దాం.
మీరు టెక్ రంగంలో జాబ్స్ కోసం చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC Recruitment 2025) అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ రీసెర్చ్ (ACR) ప్రాజెక్ట్ కోసం 280కి పైగా ఉద్యోగ ఖాళీలను ప్రకటించింది. వీటిలో డిజైన్ ఇంజనీర్, టెక్నికల్ మేనేజర్ వంటి ఉన్నత స్థాయి పోస్టులు ఉన్నాయి. వీటికి ఎంపికైన వారికి ఏడాదికి రూ.18 లక్షల నుంచి రూ.42 లక్షల వరకు జీతం లభించనుంది. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, లాస్ట్ డేట్ ఎప్పటివరకు ఉందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఖాళీల వివరాలు
చిప్ డిజైన్: 180 పోస్టులు
ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ డిజైన్: 25 పోస్టులు
సాఫ్ట్‌వేర్ ఎకోసిస్టమ్ డెవలప్‌మెంట్: 65 పోస్టులు
ఫోటోనిక్స్: 10 పోస్టులు
మొత్తం: 280+ పోస్టులు
అర్హతలు
దరఖాస్తు చేయాల్సిన అభ్యర్థులు BCA, B.Sc, B.Tech/B.E, M.Sc, MCA, PG డిప్లొమా, M.Phil/Ph.D (సంబంధిత రంగాలలో) అనుభవం కలిగి ఉండాలి. కానీ డిజైన్ ఇంజనీర్ పోస్టులకు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు.
సీడాక్ రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ విడుదల తేదీ: జూలై 5, 2025
ఆన్‌లైన్ అప్లికేషన్ల ప్రారంభం: జూలై 5, 2025
ఆన్‌లైన్ అప్లై చేసేందుకు చివరి తేదీ: జూలై 31, 2025
రాత పరీక్ష/ఇంటర్వ్యూ తేదీ: ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు
జీతం & ప్రయోజనాలు
సీడాక్‌లో చేరడం అంటే కేవలం ఉద్యోగం మాత్రమే కాదు. ఒక మంచి కెరీర్ అవకాశం లభిస్తుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలు ఆకర్షణీయ జీత భత్యాలతో పాటు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అనుభవం ఆధారంగా జీతంలో అదనపు ఇంక్రిమెంట్లు కూడా లభిస్తాయి.
డిజైన్ ఇంజనీర్ (E1): ఏడాదికి రూ.18 లక్షల వరకు
సీనియర్ డిజైన్ ఇంజనీర్ (E2): రూ.21 లక్షల వరకు
ప్రిన్సిపల్ డిజైన్ ఇంజనీర్ (E3): రూ.24 లక్షల వరకు
టెక్నికల్ మేనేజర్ (E4): రూ.36 లక్షల వరకు
సీనియర్ టెక్నికల్ మేనేజర్ (E5): రూ.39 లక్షల వరకు
చీఫ్ టెక్నికల్ మేనేజర్ (E6): రూ.42 లక్షల వరకు
దరఖాస్తు విధానం
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఎలాంటి ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ
సీడాక్‌లో ఎంపిక ప్రక్రియ కఠినంగా ఉంటుంది. ఇది అర్హులైన అభ్యర్థులను ఎంచుకునేలా రూపొందించబడింది
ప్రాథమిక స్క్రీనింగ్: విద్య, అనుభవం ఆధారంగా
రాత పరీక్ష (అవసరమైతే): సాంకేతిక నైపుణ్యాన్ని అంచనా వేయడానికి
వ్యక్తిగత ఇంటర్వ్యూ: సాంకేతిక నైపుణ్యాలు, అనుభవం, ఉద్యోగ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు
చివరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్: చేరిక సమయంలో పత్రాలను పరిశీలిస్తారు
సీడాక్ గురించి
సీడాక్ (C-DAC) అనేది భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆధ్వర్యంలో పనిచేసే ఒక సంస్థ. ఇది భారతదేశ సాంకేతిక శక్తిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ రీసెర్చ్ (ACR) ప్రాజెక్ట్ ద్వారా హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (HPC), AI సాంకేతికతలలో భారత్‌ను స్వావలంబన చేయడమే సీడాక్ లక్ష్యం. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా సీడాక్ దేశవ్యాప్తంగా ఉన్న తన కేంద్రాలలో ఉద్యోగాలను ప్రకటించింది.
ఇవి కూడా చదవండి
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 09 , 2025 | 03:49 PM