BHEL Recruitment 2025: BHELలో ఉద్యోగాలు.. నెలకు రూ.65 వేల వరకు జీతం, 10వ తరగతితోపాటు..
ABN, Publish Date - Jul 11 , 2025 | 02:49 PM
10వ తరగతితోపాటు ఐటీఐ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇటీవల భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL Recruitment 2025) 515 ఆర్టిసన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే వీటికి అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మీరు 10వ తరగతితోపాటు ఐటీఐ పూర్తి చేసి ప్రభుత్వం ఉద్యోగం కోసం చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ 515 ఆర్టిసాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (BHEL Recruitment 2025) విడుదల చేసింది. ఈ పోస్టులలో ఫిట్టర్ కోసం 176, వెల్డర్ కోసం 97, మెషినిస్ట్ కోసం 104, ఎలక్ట్రీషియన్ కోసం 65, టర్నర్ కోసం 30, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కోసం 25, ఫౌండ్రీమాన్ కోసం 18 పోస్టులు ఉన్నాయి. వీటికి ఎంపికైన అభ్యర్థులను దేశవ్యాప్తంగా ఉన్న BHEL యూనిట్లలో నియమిస్తారు. వాటిలో BAP (రాణిపేట), HERP (వారణాసి), HPVP (విశాఖపట్నం), EDN (బెంగళూరు), FSIP (జగదీష్‌పూర్), HEEP (హైదరాబాద్), HEP (భోపాల్) కలవు.
వయో పరిమితి..
జూలై 16 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది. ఈ పోస్టులకు అప్లై చేయాలంటే అభ్యర్థులు 10వ తరగతి పాసై ఉండాలి. దీంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ITI/NTC+NAC సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. అలాగే సంబంధిత రంగంలో పనిచేసిన అనుభవం ఉండాలి. నిర్దేశించిన వయోపరిమితి కనీసం 18 సంవత్సరాలు ఉండగా, గరిష్టంగా 27 సంవత్సరాలు. OBC వారికి 3 సంవత్సరాలు, SC/ST వారికి 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు లభిస్తుంది.
వెరిఫికేషన్ కోసం..
అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్ నెలలో నిర్వహించబడే రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష CBT మోడ్‌లో జరగనుంది. ఎంపికైన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. నియామకం తర్వాత, ప్రతి నెలా రూ. 29,500 నుంచి రూ. 65,000 వరకు జీతం అందిస్తారు. దీంతో పాటు, భత్యం, ఇతర సౌకర్యాలు కూడా లభిస్తాయి.
ఇలా అప్లై చేయండి..
మొదట అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఆ తర్వాత హోమ్‌పేజీలో కరెంట్ ఓపెనింగ్స్ లింక్‌పై క్లిక్ చేయండి. స్క్రీన్‌పై కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. తర్వాత సంబంధిత రిక్రూట్‌మెంట్ దరఖాస్తు లింక్‌పై క్లిక్ చేయండి. అవసరమైన సమాచారాన్ని నమోదు చేయడం ద్వారా అప్లికేషన్ పూర్తి చేయండి. దీంతోపాటు అడిగిన ఫార్మాట్‌లో సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేయండి. చివరకు రుసుము చెల్లించి అప్లికేషన్ సమర్పించండి. ఆ తర్వాత అభ్యర్థులు భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ప్రింటవుట్ తీసుకోండి.
ఇవి కూడా చదవండి
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 11 , 2025 | 02:49 PM