ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Andhrajyothi Journalism College: ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల ప్రవేశపరీక్ష వివరాలు, మోడల్‌ ప్రశ్నపత్రాలు

ABN, Publish Date - Aug 20 , 2025 | 05:12 PM

Andhrajyothy Journalism College: ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు అలర్ట్. ఈ నెల 31వ తేదీన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉన్న నేపథ్యంలో పరీక్ష వివరాలు, మోడల్ ప్రశ్న పత్రాలను ఇక్కడ అందిస్తున్నాం..

Andhrajyothy Journalism College

Andhrajyothy Journalism College: ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు అలర్ట్. ఆగస్టు 31వ తేదీన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉన్న నేపథ్యంలో పరీక్ష వివరాలు, మోడల్ ప్రశ్న పత్రాలను ఇక్కడ అందిస్తున్నాం. పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు.. వీటిని గమనించి, అందుకు అనుగుణంగా సంసిద్ధమవ్వాలని సూచన.

కీలక సూచనలు..

1. జర్నలిజం కళాశాల ప్రవేశపరీక్ష ఈ నెల 31వ తేదీ ఆదివారం జరుగుతుంది.

2. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుంది.

3. అభ్యర్థులు తాము పరీక్ష రాసే కేంద్రాలకు అరగంట ముందుగా చేరుకోవాలి.

4. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్షకు అనుమతించరు.

5. అభ్యర్థులు ఇటీవల దిగిన తమ రెండు పాస్‌పోర్ట్‌సైజు ఫొటోలు తప్పనిసరిగా తీసుకురావాలి.

పరీక్షలో ఉండే అంశాలు..

1. ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల ప్రవేశపరీక్షలో వర్తమాన వ్యవహారాలు, తెలుగు భాష, సాహిత్యం, అనువాద సామర్థ్యానికి సంబంధించిన ప్రశ్నలుంటాయి.

2. ప్రశ్నపత్రం రెండు భాగాలుగా ఉంటుంది. వర్తమాన వ్యవహారాలు, జనరల్‌ నాలెడ్జ్‌కి సంబంధించిన ఒక ప్రధానమైన వ్యాసం, రెండు లఘువ్యాసాలు, ఏకవాక్య సమాధానాలు రాయాల్సిన బిట్లు, అనువాదం, తెలుగు వాక్యాలలోని తప్పులను సరిదిద్ది తిరగరాయడం, ప్రధాన భాగంలో ఉంటాయి. రెండవ భాగం బిట్లు రూపంలో ఉంటుంది. ఇందులో ఆంగ్లపదాలకు అర్థాలు, తెలుగు పదాలలో అక్షరదోషాలు సరిదిద్దడం, తెలుగు సాహిత్యానికి సంబంధించిన బిట్లు వగైరా ఉంటాయి.

3. ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల ప్రవేశపరీక్షల మోడల్‌ ప్రశ్నపత్రాలను కింది పేజీలలో ఇస్తున్నాం.

4. ఈ మోడల్‌ పేపర్లలో కొద్దిపాటి మార్పుచేర్పులతో ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రం ఉండవచ్చు.

పరీక్ష కేంద్రాల చిరునామాలు..

హైదరాబాద్‌ : Nalanda Educational Institutions, Main Building, Vengal Rao Nagar, Hyderabad-38.

వరంగల్‌ : Adarsha Law College, Balasamudram Road, Near Warangal Press Club, RTC Bustand Road, Hanamkonda.

విశాఖపట్నం : Bhashyam High School, D.No. 50-17-64, Beside Apoorva Hospital, Dwarakanagar, Visakhapatnam - 500016.

విజయవాడ : Koneru Basavaiah Chowdari (KBC) ZPHigh School, Highschool Road, Opp. Patamata Raitu Bazar, Patamata, Vijaywada.

తిరుపతి : Andhrajyothi Office, No. 106, First Floor, Vigneswara Towers, Beside CPR Apartments, Near Leela Mahal Junction, Tirumala Bypass Road, Tirupathi.

మోడల్ ప్రశ్న పత్రాలకు సంబంధించి పూర్తి వివరాల కోసం కింద పీడీఎఫ్ చూడొచ్చు..

మోడల్ పేపర్ - 1(డౌన్‌లోడ్ చేయడం కోసం ఫైల్‌మీద క్లిక్ చేయండి)

మోడల్ పేపర్ - 2(డౌన్‌లోడ్ చేయడం కోసం ఫైల్‌మీద క్లిక్ చేయండి)

Updated Date - Sep 01 , 2025 | 11:03 PM