ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Vividha : ఈ వారం వివిధ కార్యక్రమాలు 13 10 2025

ABN, Publish Date - Oct 13 , 2025 | 05:59 AM

‘అర్రాసు’ కథా సంపుటి, వేదగిరి రాంబాబు పురస్కారాలు, ‘అట్లనే’ కవితా సంపుటి, ‘మట్టిరంగు’ కవితా సంపుటి, ‘మట్టిరంగు’ కవితా సంపుటి, సుద్దాల పురస్కారాల ప్రదానం...

‘అర్రాసు’ కథా సంపుటి

రాజీ కన్నా కథల సంపుటి ‘అర్రాసు’ ఆవిష్కరణ అక్టోబరు 14 సా.6గం టలకు మొదటి అంతస్తు, రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. వక్తలు గోరటి వెంకన్న, అల్లం నారాయణ, పెద్దింటి అశోక్‌ కుమార్‌, పల్లవి కోయిల, అబ్దుల్‌ ఖాదర్‌.

బోధి ఫౌండేషన్‌

వేదగిరి రాంబాబు పురస్కారాలు

డాక్టర్‌ వేదగిరి రాంబాబు పురస్కారాల ప్రదానోత్సవం, ‘మా కథలు 2024’ ఆవిష్కరణ, సింహ ప్రసాద్‌ కథలు ‘మనుగడ’ ఆవిష్కరణ... ఈ కార్యక్రమాలు అక్టోబరు 14 ఉ.10 గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. బాల సాహిత్య పురస్కారం పుల్లా రామాంజనేయులు, కథానిక పురస్కారం స్ఫూర్తి కందివనం స్వీకరిస్తారు. సభలో కె.వి. రమణాచారి, విహారి, సుధామ పాల్గొటారు. వివరాలకు: 98490 61668.

సింహప్రసాద్‌ సాహిత్య సమితి

‘అట్లనే’ కవితా సంపుటి

అన్నవరం దేవేందర్ ‘అట్లనే’ కవితా సంపుటి ఆవిష్కరణ సభ అక్టోబరు 17 మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌ లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలోని డాక్టర్ కేతు విశ్వనాధ రెడ్డి హాల్‌లో జరుగుతుంది. వైస్ ఛాన్స్‌లర్ ఘంటా చక్రపాణి ఆవిష్కరిస్తారు. అతిథులుగా కె. శ్రీనివాస్, అల్లం నారాయణ, రజనీ నెల్లుట్ల పాల్గొంటారు.

జీవగడ్డ మిత్రులు

‘మట్టిరంగు’ కవితా సంపుటి

సి. భవానీదేవి కవితా సంపుటి ‘మట్టిరంగు’ ఆవిష్కరణ అక్టోబరు 19 సా.6గంటలకు హోటల్‌ గౌతమి (మొదటి అంతస్తు), జి.బి .సి. రోడ్‌, బాపట్లలో జరుగుతుంది. సభాధ్యక్షులు వెలువోలు నాగరాజ్యలక్ష్మి; ముఖ్య అతిథి పాపినేని శివశంకర్‌; పుస్తక పరిచయం బీరం సుందరరావు; ఆత్మీయ అతిథులు పి.సి. సాయిబాబు, టి. శ్యామసుందర్‌.

ఆం.ప్ర. రచయితల సంఘం

విద్యార్థులకు పద్య పోటీలు

తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో పాఠ శాల స్థాయి విద్యార్థులకు జాతీయ స్థాయి తెలుగు శతక పద్య పోటీలు నిర్వహిస్తున్నా ము. వందకు పైగా పద్యాలు చెప్పగలిగిన పిల్లలు అక్టోబరు 16 లోపు 95534 29770 నంబర్‌కు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోగలరు.

తులసినాథం నాయుడు

సుద్దాల పురస్కారాల ప్రదానం

సుద్దాల జానకమ్మ హనుమంతు సాహితీ– జానపద– నృత్య పురస్కారాల ప్రదానోత్సవం అక్టోబరు 13 సా.6గం.లకు సుందరయ్య కళా నిలయం, బాగ్‌లింగం పల్లి, హైదరాబాద్‌లో జరుగుతుంది. రచ యిత్రి ఓల్గా, గాయని మధుప్రియ, నర్తకి లాలీ నిధి పురస్కారాలను స్వీకరిస్తారు. సభలో సూరేపల్లి నంద, హరిచందన దాసరి, ఎస్‌. రఘు, సుద్దాల సుధాకర్‌ తేజ, ఎన్‌ రెడ్డి రాంరెడ్డి, మడిమడకల నర్సిరెడ్డి తదితరులు పాల్గొంటారు.

సుద్దాల అశోక్‌తేజ

ఇవి కూడా చదవండి..

కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!

మచాడో మాదిరే రాహుల్‌ పోరాటం

For More National News And Telugu News

Updated Date - Oct 13 , 2025 | 06:08 AM