ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Revanth Reddys Governance: ప్రజాపథంలో రెండేళ్ల పాలన

ABN, Publish Date - Dec 05 , 2025 | 04:32 AM

తెలంగాణ గడ్డపై దశాబ్దాల రాజకీయ చరిత్రను తిరగరాస్తూ, సామాన్యుడి స్వప్నాలకు సాక్షాత్కారంగా, ప్రజాస్వామ్య స్వేచ్ఛకు చిరునామాగా నిలిచిన నాయకుడు రేవంత్‌రెడ్డి. ఆయన ముఖ్యమంత్రిగా...

తెలంగాణ గడ్డపై దశాబ్దాల రాజకీయ చరిత్రను తిరగరాస్తూ, సామాన్యుడి స్వప్నాలకు సాక్షాత్కారంగా, ప్రజాస్వామ్య స్వేచ్ఛకు చిరునామాగా నిలిచిన నాయకుడు రేవంత్‌రెడ్డి. ఆయన ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన ఈ రెండేళ్ళ ప్రయాణం కేవలం ఒక కాలమానం కాదు, అది తెలంగాణ అస్తిత్వ ఆత్మగౌరవానికి, ప్రజాపాలనకు పట్టం కట్టిన ఒక చారిత్రక ఘట్టం.

ప్రగతి భవన్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను తొలగించి, దానికి ‘ప్రజాభవన్’గా నామకరణం చేయడంతోనే ఆయన పాలనా విధానం ఎటువైపు ఉన్నదో స్పష్టమైంది. సామాన్యుడు తన గోడు చెప్పుకోవడానికి రోజుల తరబడి వేచి చూసే పరిస్థితిని మార్చి, ‘ప్రజావాణి’ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా వినే సంస్కృతికి ఆయన శ్రీకారం చుట్టారు. అధికారం అనేది ఆధిపత్యం కాదు, బాధ్యత అని చాటిచెప్పిన ఘనత ఈ రెండేళ్ళ పాలనకే దక్కుతుంది.

‘ఆడబిడ్డ కంట కన్నీరు తుడిస్తేనే ఆ ఇల్లు సిరులొలికే సామ్రాజ్యం అవుతుంది’ అని నమ్మిన రేవంత్‌రెడ్డి మహిళల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించి, వారి ఆర్థిక స్వాతంత్ర్యానికి బాటలు వేశారు. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ అందించి వంటింటి కష్టాలు తీర్చారు. నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ ద్వారా భరోసా కల్పించడం మాత్రమే గాక పారదర్శకంగా నియామకాల ప్రక్రియలు చేపట్టడం రేవంత్‌రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనం. రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలతో వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి పారుదలపై ప్రత్యేక దృష్టి సారించి రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచారు. ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని పునరుద్ధరించి, ప్రతి పేదవాడికి గూడు కల్పించే దిశగా ఈ రెండేళ్ళలో వడివడిగా అడుగులు వేశారు.

తెలంగాణ ఉద్యమ ఊపిరిగా నిలిచిన ‘జయ జయ హే తెలంగాణ.. జననీ జయకేతనం’ గీతాన్ని అధికారిక రాష్ట్ర గీతంగా ప్రకటించడం గర్వించదగ్గ అంశం. ఈ పాట నాలుగుకోట్ల తెలంగాణ బిడ్డల గుండె చప్పుడని ఆయన బలంగా విశ్వసించి, ఎలాంటి తాత్సారం లేకుండా ఈ గీతానికి రాజముద్ర వేసి, సకల ప్రభుత్వ లాంఛనాలతో ఆవిష్కరించారు. అందెశ్రీ గీతానికి పట్టం కట్టడం ద్వారా రేవంత్‌రెడ్డి సాహిత్యానికి, కళాకారులకు ఇస్తున్న విలువను చాటిచెప్పారు. అందెశ్రీ ఆకస్మికంగా మరణించినప్పుడు అంతిమయాత్రలో పాడె మోయటం ద్వారా ముఖ్యమంత్రి ఒక కవికి ఇవ్వగల అత్యున్నత గౌరవాన్ని అందించారు, సాహితీలోకంలోనూ, సమాజంలోనూ రేవంత్‌రెడ్డి చెరగని ముద్ర వేశారు. తెలంగాణ ఉద్యమ ధ్రువతార గద్దర్ మరణించినప్పుడు రేవంత్‌రెడ్డి స్పందించిన తీరు ప్రతి ఒక్కరినీ కదిలించింది. గద్దర్ పార్థివ దేహానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగేలా ఒత్తిడి పెంచి చేయించారు. ఆ తర్వాత ఆయన స్మారకార్థం ‘గద్దర్ అవార్డులు’ నెలకొల్పి ఉద్యమకారుల త్యాగాలను ఎన్నటికీ మరువనని నిరూపించుకున్నారు.

రేవంత్‌రెడ్డి పాలన సంక్షేమానికే పరిమితం కాలేదు; అది సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఆత్మగౌరవాన్ని, విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించే దిశగా సాగింది. ‘చదువు సామాజిక ఆస్తి, రిజర్వేషన్ సామాజిక హక్కు’ అనే సూత్రాన్ని ఆయన ఆచరణలో అమలుపరిచి చూపారు. గత దశాబ్ద కాలంగా నిస్తేజంగా మారిన తెలంగాణ విశ్వవిద్యాలయాలకు కొత్త ఊపిరి పోశారు. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న వైస్ చాన్స్‌లర్‌ పోస్టులను భర్తీ చేసి, విద్యా వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచారు. అట్టడుగు వర్గాలకు చెందిన విద్యావేత్తలకు యూనివర్సిటీల పగ్గాలు అప్పగించారు. పరిశోధనలకు పెద్దపీట వేస్తూ, తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దారు. వెయ్యి కోట్లతో ఉస్మానియా యూనివర్సిటీ దశ- దిశనే మార్చే గొప్ప సంకల్పానికి శ్రీకారం చుట్టారు.

మాదిగ సామాజిక వర్గం దశాబ్దాలుగా చేస్తున్న ‘ఎస్సీ వర్గీకరణ’ పోరాటానికి రేవంత్‌రెడ్డి పరిపూర్ణ న్యాయం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే కాలయాపన చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి, వర్గీకరణ అమలుకు అంకితభావంతో పనిచేశారు. ఉద్యోగ నియామకాల్లో అత్యంత వెనుకబడిన దళిత బిడ్డలకు న్యాయం చేకూర్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. దేశానికే ఆదర్శంగా నిలిచేలా తెలంగాణలో ‘సమగ్ర కుల గణన’ చేపట్టిన ఘనత రేవంత్‌రెడ్డిది. ‘ఎంతమంది జనాభా ఉంటే, వారికి అంత వాటా దక్కాలి’ (జిత్నీ ఆబాదీ ఉత్నా హక్) అనే రాహుల్‌గాంధీ మాటను తుచ తప్పకుండా అమలు చేశారు. కులగణన బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచడానికి వేసిన బలమైన పునాది. బీసీల రిజర్వేషన్లను 42శాతానికి పెంచే దిశగా అడుగులు వేస్తూ, బడుగుల జీవితాల్లో వెలుగులు నింపిన ‘బహుజన బంధువు’ రేవంత్‌రెడ్డి.

విశ్వవిద్యాలయాల్లో విద్యా కుసుమాలు వికసించేలా చేయడం నుండి, ఎస్సీ వర్గీకరణ ద్వారా అంత్యోదయానికి (చివరి మనిషికి) న్యాయం చేయడం వరకు, కులగణన ద్వారా బీసీలకు రాజ్యాధికారంలో వాటా కల్పించడం వరకు ఈ రెండేళ్ళలో రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవి. ఆయన పాలనలో సామాజిక న్యాయం అనేది నినాదం కాదు, ఆచరణీయ విధానం. అభివృద్ధి, సంక్షేమం, సాంస్కృతిక వైభవం... ఇలా బహుముఖాలుగా రేవంత్‌రెడ్డి ప్రజాపాలన సాగుతోంది. ప్రజల దీవెనలతో ఇది పదికాలాలు సాగాలి.

చనగాని దయాకర్

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి

ఈ వార్తలు కూడా చదవండి

'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!

పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 05 , 2025 | 04:32 AM