Vividha : ఈ వారం వివిధ కార్యక్రమాలు 6 10 2025
ABN, Publish Date - Oct 06 , 2025 | 05:57 AM
‘అక్రమ తుపాకులు’ తమిళ అనువాద కథలు, రెండుతరాల కవిసంగమం, సృజన సమాలోచన సదస్సు...
‘అక్రమ తుపాకులు’ తమిళ అనువాద కథలు
పదకొండు మంది తమిళ రచయితల కథలకు శ్రీనివాస్ తెప్పాల తెలుగు అనువాదాలతో కథా సంకలనం ‘అక్రమ తుపాకులు’ ఆవిష్కరణ సభ అక్టోబర్ 9 సా.6గంటలకు లామకాన్, బంజారాహిల్స్, హైదరాబాద్‌లో జరుగుతుంది. వక్తలుగా కవి సిద్ధార్థ, పి. జ్యోతి, ఇండ్ల చంద్రశేఖర్, కె. రామచంద్రరెడ్డి మాట్లాడతారు.
బోధి ఫౌండేషన్
రెండుతరాల కవిసంగమం
రెండుతరాల కవిసంగమం సిరీస్ – -44 కార్యక్రమం అక్టోబర్ 11 సా.6గంటలకు నిజాం కాలేజి, బషీర్ బాగ్, హైదరాబాద్‌లో జరుగుతుంది. పాల్గొంటున్న కవులు: కొండి మల్లారెడ్డి, వి.ఆర్. తూములూరి, లావణ్య సైదీశ్వర్, మహేష్ వేల్పుల, పి. వెంకటేష్ (నిజాం కాలేజి ఎం.ఏ విద్యార్థి)
-కవిసంగమం
సృజన సమాలోచన సదస్సు
తెలుగు భాషా చైతన్య సమితి ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమి సౌజన్యంతో కవి యాకూబ్ సృజన సమాలోచన సదస్సు అక్టోబర్ 13 ఉ.10గంటల నుంచి సా.8గంటల వరకు రవీంద్రభారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది.
తెలుగు భాషా చైతన్య సమితి
ఈ వార్తలు కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
Updated Date - Oct 06 , 2025 | 05:57 AM