Vividha: ఈ వారం వివిధ కార్యక్రమాలు 20 10 2025
ABN, Publish Date - Oct 20 , 2025 | 03:21 AM
రెండు పుస్తకాల ఆవిష్కరణ, సాహితీ పురస్కారాలు, పుస్తక పఠన కార్యక్రమం, ముద్దన హనుమంతరావుపై పుస్తకం, గడియారం వేంకట శేషశాస్త్రి సాహిత్య పురస్కారాలు...
రెండు పుస్తకాల ఆవిష్కరణ
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణలుగా పరవస్తు లోకేశ్వర్ ‘షహర్ నామా’, జయ మోహన్ తమిళ కథలకు అవినేని భాస్కర్ అనువాదం ‘మాడన్ మోక్షం’ పుస్తకాల ఆవి ష్కరణ అక్టోబర్ 25న ఉదయం 11 గం.లకు, 12 గం.లకు ఛాయా లిటరేచర్ ఫెస్టివల్‌లో భాగంగా అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జూబ్లీహిల్స్, హైదరాబాద్‌లో జరుగుతాయి.
గీతా రామస్వామి
సాహితీ పురస్కారాలు
శిఖామణి సాహితీ పురస్కారాల ప్రదానం, కవి సంధ్య సంస్థ దశాబ్ది ఉత్సవం అక్టోబరు 26 ఉ.10గంటలకు యానాం, డా.బి.ఆర్. అంబేద్కర్ కళ్యాణ మండపంలో జరుగుతుంది. జీవన సాఫల్య పురస్కారాన్ని కొలకలూరి ఇనాక్, యువ పురస్కారాన్ని అవధానుల మణిబాబు అందుకుంటారు. శిఖామణి అధ్యక్షతన జరిగే సభలో మల్లాడి కృష్ణారావు, మండలి బుద్ధ ప్రసాద్, అప్పాజోస్యుల సత్యనారాయణ, కోయి కోటేశ్వరరావు తదితరులు పాల్గొంటారు. కవి సంధ్య – 56 ఆరుద్ర, బైరాగి శత జయంతి సంచికల ఆవిష్కరణ ఉంటుంది.
దాట్ల దేవదానం రాజు
పుస్తక పఠన కార్యక్రమం
పిల్లలు, పెద్దల్లో పుస్తక పఠన సంస్కృతిని పెంచడానికి అక్టోబర్ 26 ఉ.10గంటల నుండి మ.12 గంటల వరకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లోను, విజయవాడలోను, మరికొన్ని ప్రాంతాల్లోని ప్రముఖ పార్కులలోను పుస్తక పఠనం జరుగుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, రచయితలు, పుస్తక ప్రియులు ఈ మరో గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొనవచ్చు. వివరాలకు: 98491 56588, 99495 35695, 88019 10908.
విజయ భండారు
ముద్దన హనుమంతరావుపై పుస్తకం
బొల్లేపల్లి సత్యనారాయణ, వెన్నిశెట్టి సింగారావు సంపాదకులుగా వెలువరించిన ‘ప్రజల వైద్యుడు డాక్టర్ మదన హనుమంతరావు’ గ్రంథా విష్కరణ సభ అక్టోబర్ 26 ఉ.10గంటలకు బృందా వన్ గార్డెన్స్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, గుంటూరులో జరుగుతుంది. సభలో యల మంచిలి శివాజీ, చిటిపోతు మస్తానయ్య, కరణం బలరామకృష్ణమూర్తి తదితరులు పాల్గొంటారు.
భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్
గడియారం వేంకట శేషశాస్త్రి సాహిత్య పురస్కారాలు
గడియారం వేంకట శేషశాస్త్రి 44వ సాహిత్య పురస్కార ప్రదాన సభ రచన సాహిత్య వేదిక – గడియారం కుటుంబీకుల ఆధ్వర్యంలో అక్టోబరు 26 సా.5.30గం.లకు ప్రొద్దుటూరు వై.యం.ఆర్. కాలనీలోని అరబిందో ఇంటెగ్రల్ హైస్కూల్‌లో జరుగుతుంది. అవార్డుకు పరిమి శ్రీరామనాథ్ ‘జీవాతువు’ కావ్యం ఎంపికైంది. ఆయనకు రూ.10వేల నగదు బహుమతితో సత్కారం ఉంటుంది. కార్యక్రమంలో కొమ్మిశెట్టి మోహన్, ఎ.సి. దస్తగిరి, సి.హెచ్. రవిచంద్రారెడ్డి తదితరులు పాల్గొంటారు. వివరాలకు: 9966624276.
భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి
ఈ వార్తలు కూడా చదవండి..
అల్పపీడనం ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 20 , 2025 | 03:21 AM