Celebrating Telugu Literature: ఈ వారం వివిధ కార్యక్రమాలు 01 09 2025
ABN, Publish Date - Sep 01 , 2025 | 12:53 AM
‘త్రివేణి’ కవిత్వ సంపుటి, ఉదారి నాగదాసు కవితా పురస్కారం, దీర్ఘకవితల పోటీలు, విశ్వనాథ నవలలపై సదస్సు, అనిశెట్టి రజితపై సమాలోచన...
‘త్రివేణి’ కవిత్వ సంపుటి
వారాల ఆనంద్ కవితా సంపుటి ‘త్రివేణి’ (మూడు పం క్తుల కవిత్వం) ఆవిష్కరణ సెప్టెంబర్ 1 న కరీంనగర్ లోని కార్ఖానగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతుంది. పాఠశాల ఉపాధ్యాయుడు, సాహితీ గౌతమి అధ్యక్షుడు నంది శ్రీనివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పుస్తకాన్ని హిందీ ఉపాధ్యాయుడు ఉడుత రాజేశం ఆవిష్కరిస్తారు. పలువురు కవులు హాజరవుతారు.
వి. ఇందిరా రాణి
ఉదారి నాగదాసు కవితా పురస్కారం
ఉదారి నాగదాసు స్మారక కవితా పురస్కారాన్ని 2025 సంవత్సరానికిగాను ప్రముఖ కవయిత్రి తోట నిర్మలారాణి స్వీకరిస్తారు. సెప్టెంబర్ 7న ఆదిలాబాద్‌లో అవార్డు ప్రదానోత్సవం జరుతుంది. అవార్డు కింద రూ.5వేల నగదు, ప్రశంసా పత్రం అంద జేస్తారు. మరిన్ని వివరాలకు: 9441413666.
ఉదారి నారాయణ
దీర్ఘకవితల పోటీలు
రాయలసీమ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో దీర్ఘ కవితల పోటీలను తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి స్మారకంగా నిర్వహిస్తున్నాం. రాయలసీమ నేపథ్యంగా, దీర్ఘ కవితా లక్షణాలతో నవంబర్ 1 లోపు కవితలను పంపాలి. మరిన్ని వివరాలకు 9963917187నంబరులో సంప్రదించగలరు. న్యాయనిర్ణేతల నిర్ణయం మేరకు మొత్తంగా రూ.15వేల నగదును బహుమతులుగా అందచేస్తాం.
అప్పిరెడ్డి హరినాథరెడ్డి
విశ్వనాథ నవలలపై సదస్సు
విశ్వనాథ సాహిత్య అకాడమి – వివిఐటి విశ్వవిద్యాలయం, నంబూరు సంయుక్త నిర్వహణలో ‘విశ్వనాథ పథంలో యువత’ శీర్షికతో విశ్వనాథ సత్యనారాయణ నవలా సాహిత్యంపై నేటి యువత దృక్పథం – పత్రసమర్పణ సదస్సు సెప్టెంబర్ 7 ఉ.9.45ని.ల నుండి శ్రీ త్యాగరాజ సాంస్కృతిక సంఘం, లక్ష్మీపురం, గుంటూరులో జరుగుతుంది. మద్దినేని సింహకౌటిల్య చౌదరి, విశ్వనాథ సత్యనారాయణ (విశ్వనాథ మనుమడు), పిన్నమనేని మృత్యుంజయరావు, అబ్బరాజు మైథిలి, హేలీకళ్యాణ్ తదితరులు పాల్గొంటారు.
మోదుగుల రవి
అనిశెట్టి రజితపై సమాలోచన
అనిశెట్టి రజిత జీవితం–సాహిత్యం పై సమాలోచన కార్యక్రమం సెప్టెం బరు 2 సా.5గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్‌హాల్, హైదరాబాద్‌లో జరుగు తుంది. సభాధ్యక్షుడు నామోజు బాలా చారి, ముఖ్య అతిథి ముదిగంటి సుజాతా రెడ్డి, గౌరవ అతిథి నందిని సిధారెడ్డి, విశిష్ట అతిథి సంగిశెట్టి శ్రీనివాస్, ఆత్మీయ అతిథి జూపాక సుభద్ర, వక్తలు తిరునగరి దేవకీ దేవి, నెల్లట్ల రమాదేవి, బ్రహ్మచారి, గిరిజ పైడిమర్రి.
భండారు విజయ
ఇవి కూడా చదవండి
లిక్కర్ కేసులో మాజీ సీఎం జైలుకు పోవటం ఖాయం.. గోనె ప్రకాష్ రావు సంచలన ప్రెస్‌మీట్
మహా గణపతి దర్శనం కోసం తరలివస్తున్న లక్షలాది మంది భక్తులు..
Updated Date - Sep 01 , 2025 | 12:53 AM