ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Public Relations Society: ఈ వారం వివిధ కార్యక్రమాలు 30 09 2025

ABN, Publish Date - Sep 29 , 2025 | 05:18 AM

పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా, తిరుపతి చాప్టర్ ఆధ్వర్యంలో ఆర్.సి. కృష్ణస్వామి రాజు రాసిన ఏభై పొట్టి కథల ‘గరం గరం చాయ్’ పుస్తక ఆవిష్కరణ అక్టోబర్‌ 1 సా.4.30కు...

‘గరం గరం చాయ్’ కథలు

పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా, తిరుపతి చాప్టర్ ఆధ్వర్యంలో ఆర్.సి. కృష్ణస్వామి రాజు రాసిన ఏభై పొట్టి కథల ‘గరం గరం చాయ్’ పుస్తక ఆవిష్కరణ అక్టోబర్‌ 1 సా.4.30కు వేమన విజ్ఞాన కేంద్రం, యశోద నగర్, తిరుపతిలో జరుగనున్నది. ఈ పుస్తకాన్ని ఎం.పి. నరసింహరాజు, ఉపకులపతి, దమ్మ దీప అంతర్జాతీయ బౌద్ధ విశ్వవిద్యాలయం, త్రిపుర ఆవిష్కరిస్తారు. జి. శైలమ్మ, ద్రవిడ విశ్వవిద్యాలయం, కుప్పం సమీక్ష చేస్తారు. ముఖ్య అతిథులు తిరునగరి శరత్ చంద్ర, ఎన్. ధర్మయ్య. వివరాలకు: 93936 62821.

జి.ఎస్.ప్రసాద్

కథలు, కవితల పోటీ

ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం – ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ సౌజన్యంతో, మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ నిర్వహణలో కథలు, కవితల పోటీ జరుగుతుంది. సమకాలీన సామాజిక సమస్యల్ని, ప్రశార్థకమౌతున్న మానవతా విలువల్ని స్పృశిస్తూ కథల్ని, కవితల్ని ఆహ్వానిస్తున్నాం. వీటిని డీటీపీ చేసి గానీ, యూనికోడ్ ఫాంట్‌లో గాని మాత్రమే పంపాలి. రూ.5వేల చొప్పున 8 ఉత్తమ కథలు, వెయ్యి చొప్పున 10 కన్సొలేషన్ కథలు; రూ.2,500ల చొప్పున 8 ఉత్తమ కవితలు, ఐదు వందల చొప్పున 10 కన్సొలేషన్ కవితలను ఎంపిక చేస్తారు. 3 – 5 పేజీలు మించని కథలను, నలభై లైన్లకు మించని కవితలను అక్టోబరు 15లోపు ఈమెయిల్‌: malleteega.sss@gmail.comకు పంపాలి. వివరాలకు: 92464 15150.

కలిమిశ్రీ

ఇవీ చదవండి:

Allianz Global Wealth Report 2025: కుటుంబాల సంపద మరింత పైకి

Pharma Stocks Plunge: ఫార్మా సుంకాల షాక్‌

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 29 , 2025 | 05:20 AM