Vividha : ఈ వారం వివిధ కార్యక్రమాలు 25 08 2025
ABN, Publish Date - Aug 25 , 2025 | 12:33 AM
‘తలపుల పుటలు’, ‘ముందడుగు’, మునిపల్లె శతజయంతి సదస్సు, ‘దాపు’ కవిత్వ సంపుటి...
‘తలపుల పుటలు’
కవిత్వ సంపుటి తెరవే కరీంనగర్ ఆధ్వర్యంలో బూర్ల వెంకటేశ్వర్లు కవిత్వ సంపుటి ‘తలపుల పుటలు’ ఆవిష్కరణ సభ ఆగస్టు 25 సాయంత్రం కరీంనగర్ ఫిలిం భవన్‌లో జరుగుతుంది. అధ్యక్షత సి.వి.కుమార్, ముఖ్య అతిథి అన్నవరం దేవేందర్, ఆవిష్కర్త నగునూరి శేఖర్, పుస్తక పరిచయం తోట నిర్మలా రాణి. అతిథులుగా కొండి మల్లారెడ్డి, కల్వకుంట్ల రామకృష్ణ, కందుకూరి అంజయ్య తదితరులు పాల్గొంటారు.
సి. వి. కుమార్
‘ముందడుగు’
నాటక ప్రదర్శన రసరంజని ఆధ్వర్యంలో సమాహార థియేటర్ గ్రూప్ సమర్పణలో వాసిరెడ్డి భాస్కర రావు, సుంకర సత్యనారాయణ 1945లో రాసిన ‘ముందడుగు’ నాటకం ప్రదర్శన రత్నశేఖర్ దర్శ కత్వంలో ఆగస్టు 25 సా.౬.45ని.లకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. సంగీతం వంశీమోహన్, రైటింగ్ కావలి రాజశేఖర్, సెట్స్ సురభి జయవర్ధన, మేకప్ బాబూ రావు సంస్థ, స్టేజ్ మేనేజర్లు మాధవ్ రెడ్డి, భార్గవ్ కళ్యాణ్.
రసరంజని
మునిపల్లె శతజయంతి సదస్సు
సాహిత్య అకాడమీ నిర్వహణలో మునిపల్లె రాజు శత జయంతి సదస్సు ఆగస్టు 30 ఉ.10 గం.టల నుంచి ఎస్.వి.కె.పి & డా. కె.యస్. రాజు ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్, పెనుగొండ, పశ్చిమగోదావరి జిల్లాలో జరుగుతుంది. కె. శ్రీనివాసరావు, సి. మృణాళిని, చినవీరభద్రుడు, వై.వి.వి. అప్పారావు, టి. నాగిరెడ్డి, కె. లక్ష్మీప్రసన్న, కలిదిండి రామచంద్రరాజు, వి. లవకుమార్ తదితరులు పాల్గొంటారు. ఉష మునిపల్లె, రంకిరెడ్డి రామ మోహన రావు, కానుకొల్లు బాలకృష్ణ, కాకుమాని శ్రీనివాసరావు, బిహెచ్‌వి రమాదేవి పత్ర సమర్పణ చేస్తారు.
సి. మృణాళిని
‘దాపు’ కవిత్వ సంపుటి
సృజన సాహితి ఆధ్వర్యంలో మునాసు వెంకట్ కవిత్వ సంపుటి ‘దాపు’ ఆవిష్కరణ ఆగస్టు 31 ఉ.10గం.లకు నల్లగొండలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా ఆయన నివాసంలో జరుగుతుంది. సభాధ్యక్షులు బెల్లి యాదయ్య, విశిష్ట అతిథి గోరటి వెంకన్న, గౌరవ అతిథి అంబటి సురేందర్ రాజు, ప్రత్యేక ఆహ్వానితులు గుంటూరు లక్ష్మీనరసయ్య, ఆత్మీయ అతిథులు సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సిద్ధార్థ తదితరులు.
పెరుమాళ్ళ ఆనంద్
ఈ వార్తలు కూడా చదవండి..
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
For More Telangana News And Telugu News
Updated Date - Aug 25 , 2025 | 12:33 AM