Padmavati Rambhaktas: మనిద్దరం
ABN, Publish Date - Aug 25 , 2025 | 12:40 AM
పేరుకే మనిద్దరం సమాంతర రేఖల్లా సాగిపోతూ విడివిడిగా విరిగిపోతూ మన గదిలో అనుబంధాల ఊయలలుండవు ఎప్పటికప్పుడు దళసరెక్కుతున్న పల్చని గోడలు తప్ప వెతికినా వెలుతురుండదు మబ్బులా కమ్మేసిన చీకటి తప్ప...
పేరుకే మనిద్దరం సమాంతర రేఖల్లా సాగిపోతూ విడివిడిగా విరిగిపోతూ మన గదిలో అనుబంధాల ఊయలలుండవు ఎప్పటికప్పుడు దళసరెక్కుతున్న పల్చని గోడలు తప్ప వెతికినా వెలుతురుండదు మబ్బులా కమ్మేసిన చీకటి తప్ప నీదొక ఇటుక ముక్క నాదొక ఇసుక రేణువు కలగలిపి ఒక నిలువెత్తు నిశ్శబ్దాన్ని నిర్మించాం లోపల ఎగిరే రంగుల సీతాకోకలను పెరిగిన పరిమళాల పూలతోటలను నెమ్మది నెమ్మదిగా తెలియకుండానే చిదిమేసాం యవ్వనోత్సాహ కలలను కాలం కొలిమిలో బూడిద చేసాం మన ఉదయాలు సాయంత్రాలు పరుగులో కరిగిపోయాయి అలసటలో ఆరిపోయాయి దేహాల రాపిడికి రాలిపడ్డ పసిమొలకకు మాత్రం నువ్వు కాస్త నీరు తాగిస్తే నేను కొంత ఎరువు అందిస్తూ ఈ ప్రయాణం ఎటు పోతోందో నీకూ నాకూ తెలీదు తెలిసిందల్లా ప్రపంచం ఎదుట అందమైన ముసుగులతో ప్రదర్శనలివ్వడమే
పద్మావతి రాంభక్త
99663 07777
ఈ వార్తలు కూడా చదవండి..
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
For More Telangana News And Telugu News
Updated Date - Aug 25 , 2025 | 12:41 AM