ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

The Literary Giant Chilakamarti Lakshminarasimham: ఆంధ్రా మిల్టన్

ABN, Publish Date - Sep 25 , 2025 | 05:58 AM

19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుగొమ్మలుగా నిలిచిన మహామహులలో చిలకమర్తి ఒకరు. ఇరవై రెండేళ్ళ వయసులో ఆయన రచించిన ‘గయోపాఖ్యానం’...

19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుగొమ్మలుగా నిలిచిన మహామహులలో చిలకమర్తి ఒకరు. ఇరవై రెండేళ్ళ వయసులో ఆయన రచించిన ‘గయోపాఖ్యానం’ నాటకం ప్రతులు లక్షకు పైబడి అమ్ముడుపోవటం తెలుగు సాహిత్య చరిత్రలో కనీవినీ ఎరగని విషయం. ఈ నాటకంలో టంగుటూరి ప్రకాశం పంతులు అర్జునుడి వేషం వేసేవారు. లక్ష్మీనరసింహం 1867 సెప్టెంబర్ 26న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలంలోని ఖండవల్లి గ్రామంలో వెంకన్న, రత్నమ్మ దంపతులకు జన్మించారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే ఆయన విద్యాభ్యాసం సాగింది.

చిలకమర్తి మొదట కొంతకాలం ‘సరస్వతి’ పత్రిక సంపాదకునిగా పనిచేశారు. ఆపై ఉద్యోగం విరమించి 1899లో హిందూ లోయర్ సెకండరీ స్కూల్ స్థాపించి తొమ్మిది సంవత్సరాలు దానిని నడిపారు. అనంతర కాలంలో అది వీరేశలింగం ఉన్నత పాఠశాలగా మార్చబడింది. లక్ష్మీనరసింహం మొదటితరం సంఘ సంస్కర్త. 1909లో సామాజికంగా వెనుకబడిన వర్గాల కోసం రామ్మోహన పాఠశాలను స్థాపించారు. తన సొంత రాబడితోనే ఆ పాఠశాలను నడిపారు. తన 30వ ఏట నుంచి రేచీకటి వ్యాధికి గురైనప్పటికీ, రచనలు చేయడం మానలేదు. ఆయన రచనలు పది సంపుటాలుగా ప్రచురితమయ్యాయి. 1943లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను కళాప్రపూర్ణ పురస్కారంతో సత్కరించింది.

కీచకవధ ఆయన మొదటి నాటకం. తరువాత ద్రౌపదీ పరిణయం, గయోపాఖ్యానం, శ్రీరామజననం, సీతా కళ్యాణం, పారిజాతాపహరణం వంటి నాటికలు రచించారు. ఆయన రాసిన నవలల్లో రామచంద్ర విజయం, హేమలత, అహల్యాబాయి, సుధా శరచ్చంద్రము ప్రముఖమైనవి. వీటితో పాటు సౌందర్య తిలక, పార్వతీ పరిణయం రాశారు. 1908లో ఒక ప్రింటింగ్‌ ప్రెస్ ప్రారంభించారు. 1916లో మనోరమ అనే పత్రికను స్థాపించారు. దీని ద్వారా గణపతి, రాజరత్నము, రఘుకుల చరిత్ర (కాళిదాసు రచన రఘువంశానికి అనువాదం), సిద్ధార్థ చరిత్ర వంటివి ప్రచురించారు.

చిలకమర్తివారు దళిత జనులకు చేసిన సేవలను అప్పటి మద్రాస్ గవర్నర్ లార్డ్ పెంట్‌లాండ్ ఎంతగానో ప్రశంసించారు. బ్రహ్మసమాజం, హితకారిణీ సమాజం వంటి సంస్కరణ దృక్పథం గల సంఘాల కార్యకలాపాలలో పాలుపంచుకొన్నారు. దేశమాత అనే వారపత్రిక ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వ్యాసాలు వ్రాశారు. 1894లో ఆయన రాసిన రామచంద్ర విజయం అనే సాంఘిక నవల న్యాపతి సుబ్బారావు నిర్వహించిన పోటీల్లో మొదటి బహుమతి పొందింది. ఇది ఆయన ఆత్మకథ అంటారు. 1897లో చిలకమర్తి రాసిన ‘పృథ్వీరాజీయం’ అనే గేయసంపుటి రాతప్రతి ప్రమాదవశాత్తూ చిరిగిపోయింది. కనుక ప్రచురణకు నోచుకోలేదు. ‘భరత ఖండంబు చక్కని పాడియావు’ ఆనేది ఆయన రచనే. 1946 జూన్ 17న లక్ష్మీనరసింహం తుదిశ్వాస విడిచారు. ఆయన్ను అందరూ ఆంధ్రా మిల్టన్ అని పిలుచుకుంటారు.

– యం. రాం ప్రదీప్, తిరువూరు

(రేపు: చిలకమర్తి లక్ష్మీనరసింహం జయంతి)

వార్తలు కూడా చదవండి..

కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్

అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు

For More AP News And Telugu News

Updated Date - Sep 25 , 2025 | 05:58 AM