ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Andhra Pradesh Development: సవాళ్ల మధ్య సంక్షేమం అభివృద్ధి సవారీ

ABN, Publish Date - Sep 10 , 2025 | 01:08 AM

గత ఐదేళ్ల జగన్ పాలన రాష్ట్రానికి ఒక పీడకలగా మిగిలింది. ఆర్థిక అరాచకం రాజ్యమేలింది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సమస్త వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. వాటిని సరిదిద్ది రాష్ట్రాభివృద్ధిని...

గత ఐదేళ్ల జగన్ పాలన రాష్ట్రానికి ఒక పీడకలగా మిగిలింది. ఆర్థిక అరాచకం రాజ్యమేలింది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సమస్త వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. వాటిని సరిదిద్ది రాష్ట్రాభివృద్ధిని పట్టాలెక్కించడానికి కూటమి ప్రభుత్వం 15 నెలలుగా శ్రమిస్తోంది. రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చెయ్యడానికి లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు కాలంతో పోటీపడుతున్నారు. రాష్ట్ర ప్రజలు తనపై పెట్టుకొన్న నమ్మకాన్ని, అంచనాలను నిలబెట్టుకుంటూ పాలన సాగిస్తున్నారు. సంక్షేమం–అభివృద్ధి జోడు గుర్రాలుగా పాలనను పరుగులు పెట్టిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సూపర్‌ సిక్స్‌ విజయంపై కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ నేడు సంయుక్తంగా అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించి, ఇప్పటివరకూ అమలు చేసిన వివిధ సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజెప్పాలని నిర్ణయించాయి.

అధికార పగ్గాలు చేపట్టగానే ఏన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా పెంచిన పింఛన్లను అమలు చేసేలా సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. అప్పటివరకు అందుతున్న రూ.3వేల పింఛన్‌ను ఒకేసారి రూ.4వేలకు పెంచి తన హామీ నిలబెట్టుకొన్నారు. తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ ఆర్థిక సాయం అందిస్తూ తల్లుల ఖాతాల్లో రూ.13వేల చొప్పున జమ చేశారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకి రూ.2వేల చొప్పున మూడు విడతలుగా ఆర్థికసాయం అందించింది ప్రభుత్వం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించింది. స్త్రీశక్తి పథకం కింద 5 కోట్ల పైచిలుకు ప్రయాణాలతో మహిళలు దీన్ని సూపర్‌ హిట్‌ చేశారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 మందిని ఉపాధ్యాయులుగా భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు సీఎం చంద్రబాబు. జగన్‌రెడ్డి ఐదేళ్ళల్లో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదు.

మహిళలకు దీపం–2 పథకం ద్వారా ఏడాదికి 3 ఉచిత సిలెండర్లకు రూ.2,684 కోట్ల వ్యయం చేశారు. జగన్ నిలిపేసిన అన్న క్యాంటీన్లను కూటమి అధికారంలోకి రాగానే పునరుద్ధరించి అన్నార్తుల ఆకలి తీరుస్తున్నది. చేతివృత్తులు, కులవృత్తులకు అండగా నిలిచేందుకు అన్ని వర్గాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. బీసీల గృహనిర్మాణానికి అదనంగా రూ.50 వేలు, బీసీల ఇళ్లపై 3 కిలోవాట్ల సోలార్‌ రూఫ్‌టాప్‌ ఏర్పాటుకు రూ.98వేల సబ్సిడీ అందిస్తోంది. 40వేల సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తోంది. కల్లుగీత కార్మికులకు 10శాతం మద్యం దుకాణాలు, బార్‌లు కేటాయించింది. మత్స్యకారులకు వేట విరామ సమయంలో 20 వేల చొప్పున ఆర్థిక సాయం ఇస్తోంది. చేనేతకు అండగా హ్యాండ్లూమ్స్‌కు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్‌ అందిస్తోంది. నేతన్న భరోసా కింద చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.25వేల సాయాన్ని అందిస్తున్నది.

ఎస్సీ వర్గీకరణతో వారి దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చింది. ఏజెన్సీ ప్రాంతాల్లో అడవితల్లి బాటలో కార్యక్రమం ద్వారా రూ.1,000 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టింది. పేద ధనిక తారతమ్యం లేకుండా 5 కోట్ల మంది ప్రజలకు వర్తింపజేస్తూ యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ అమలుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.25 లక్షల వరకూ వైద్యచికిత్సలు ఉచితంగా చేయించుకునేందుకు ఆస్కారం కల్పించింది. శాండ్, వైన్, మైన్, డ్రగ్స్ మాఫియాలపై ఉక్కుపాదం మోపింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 20 వేల కి.మీ రోడ్లు మరమ్మత్తులు చేశారు. వీటితోపాటు సీసీ, బీటీ, రాష్ట్ర రహదారులు 7 వేల కి.మీ నిర్మించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,987 కోట్లు పంచాయతీలకు విడుదల చేశారు.

ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ను తిరిగి తీసుకొచ్చేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. పారిశ్రామిక వికాసంపై విశ్వాసం కలిగించారు. ఇప్పటికే లులూ, ఒబెరాయ్‌, బ్రూక్‌ఫీల్డ్‌, సుజలాన్‌, గూగుల్, కాగ్నిజెంట్, గూగుల్ డేటా సెంటర్ వంటి సంస్థలు ముందుకు రాగా, మరికొన్ని సంస్థలు రాష్ట్రానికి రావడానికి సిద్ధపడటంతో విశాఖ ఐటీ హబ్‌గా మారనున్నది. స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాలను చేరుకునే క్రమంలో రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారు. 15 నెలల్లో దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏడు లక్షల ఉద్యోగాలు కల్పించారు.

పోలవరానికి కేంద్రం నుంచి రూ.12,157 కోట్లు సాధించారు. ప్రజారాజధాని అమరావతి నిర్మాణాలకు కేంద్రం నుంచి రూ.15వేల కోట్లు సాధించి, ప్రధానితో పునఃప్రారంభం చేయించారు. విశాఖ స్టీల్ పరిరక్షణకు రూ.11 వేల కోట్లు, విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి ప్రధానితో శంకుస్థాపన చేయించారు. ఓర్వకల్లు పారిశ్రామికవాడకు రూ.2,786 కోట్లు, కొప్పర్తి పారిశ్రామికవాడకు రూ.2,137 కోట్లు కేంద్రం నుంచి సాధించారు. కేంద్రం నివేదిక ప్రకారమే వైసీపీ హయాంలో 2023–24లో వృద్ధిరేటు కేవలం 6.19 శాతం మాత్రమే కాగా, 2024–25లో 8.21 శాతం వృద్ధి రేటు సాధించి దేశంలోనే రెండో స్థానంలో నిలవడం అభినందనీయం. ప్రభుత్వం, ప్రైవేటు కంపెనీలు, ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, పీ–4 విధానం ద్వారా రాష్ట్రంలోని పేదరికాన్ని జీరో పావర్టీ సమూలంగా నిర్మూలించడానికి సీఎం చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు.

తొండపు దశరథ జనార్దన్

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు

ఈ వార్తలు కూడా చదవండి..

యూరియాపై వైసీపీది అసత్య ప్రచారం.. మంత్రి సుభాష్ ఫైర్

ఆ ఐపీఎస్‌లకు మళ్లీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం

For More AP News And Telugu News

Updated Date - Sep 10 , 2025 | 01:08 AM