ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Manufacturing Sector India: వికసిత భారత్‌కు పునాది తయారీ రంగం

ABN, Publish Date - Dec 19 , 2025 | 02:18 AM

ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయిలోను, జాతీయ స్థాయిలోను నిర్వహిస్తున్న ‘పార్టనర్‌షిప్ సమ్మిట్లు’ భారత తయారీ రంగానికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తున్నాయి. ఈ సమ్మిట్లు ప్రభుత్వాలు, పరిశ్రమలు, పెట్టుబడిదారులు..

ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయిలోను, జాతీయ స్థాయిలోను నిర్వహిస్తున్న ‘పార్టనర్‌షిప్ సమ్మిట్లు’ భారత తయారీ రంగానికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తున్నాయి. ఈ సమ్మిట్లు ప్రభుత్వాలు, పరిశ్రమలు, పెట్టుబడిదారులు, అంతర్జాతీయ భాగస్వాములు కలిసి దేశ ఆర్థికాభివృద్ధి కోసం వ్యూహాత్మక చర్చలు జరిపే వేదికలుగా నిలుస్తున్నాయి. ఇక్కడ ప్రదర్శనలో ఉంచే తయారీ రంగ ప్రాజెక్టులు, నూతన టెక్నాలజీలు, పెట్టుబడి ప్రతిపాదనలు రాష్ట్రాల పరిశ్రమ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాయి. తయారీ రంగం కేవలం ఉద్యోగాల సృష్టికి మాత్రమే గాక, దేశ స్వావలంబనకు, ఎగుమతుల వృద్ధికి, సాంకేతిక ప్రగతికి పునాది. అందువల్ల ఇలాంటి సమ్మిట్లు ‘మేక్ ఇన్ ఇండియా’ దిశగా ప్రయాణిస్తున్న భారతదేశానికి ప్రేరణగాను, భాగస్వామ్య వేదికలుగాను నిలుస్తున్నాయి.

‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI)’ వంటి పథకాలతో దేశ పరిశ్రమలకు కొత్త శక్తి వచ్చింది. అయితే ఈ ఉత్సాహం మధ్యలో ఒక వాస్తవాన్ని మరిచిపోకూడదు: తయారీ రంగం అనేది ఐటీ, సేవలు, పర్యాటక రంగాల మాదిరిగా కాదు. దీని సమస్యలు, అవసరాలు వేరు. అందువల్ల అన్ని రంగాలకు ఒకే విధానం వర్తింపజేయడం సరికాదు.

ప్రస్తుతం తయారీ రంగం భారత జీడీపీలో 12–13శాతం వాటాను కలిగి ఉంది. అయితే ఇది ఇతర అభివృద్ధి చెందిన దేశాల కంటే తక్కువ (చైనా 25శాతం, జపాన్ 21శాతం, జర్మనీ 19శాతం). భారతదేశంలో 6.3 కోట్లకు పైగా MSME యూనిట్లు పనిచేస్తున్నాయి. ఇందులో 99శాతం సూక్ష్మ, 0.52 శాతం చిన్న, 0.01శాతం మధ్య తరహా సంస్థలు ఉన్నాయి. ఇవి కలిపి 11 కోట్లకు పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. వ్యవసాయం తర్వాత రెండవ పెద్ద ఉపాధి రంగం ఇదే. తయారీ రంగం జీడీపీ వాటా తక్కువగా ఉన్నా, 2023–24 ఆర్థిక సంవత్సరంలో తయారీ గ్రాస్‌ వాల్యూ ఏడెడ్‌ (GVA) 11.9శాతం వృద్ధి సాధించడం ఆశాజనకమైన సూచన.

తయారీ రంగం ఉపాధిని సృష్టిస్తుంది. సాంకేతిక అభివృద్ధికి దారితీస్తుంది. దిగుమతులను తగ్గిస్తుంది. ఎగుమతులను పెంచి విదేశీ మారకద్రవ్యాన్ని సమకూరుస్తుంది. ఐటీ లేదా సేవా రంగాలు డిజిటల్ మౌలిక వసతులపైన ఆధారపడతాయి. తయారీ రంగం మాత్రం శక్తి, రవాణా, భౌతిక మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడుతుంది. కాబట్టి ప్రభుత్వ విధానాలు ఈ రంగానికి ప్రత్యేకంగా ఉండాలి. మన ప్రభుత్వం ఈ దిశగా తీసుకున్న కొన్ని సానుకూల విధానాల వలన పీఎల్‌ఐ పథకాల ద్వారా ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, రక్షణ, ఔషధ రంగాల్లో పెట్టుబడులు పెరిగాయి. ఉద్యోగ రిజిస్ట్రేషన్, ఉద్యమ అసిస్ట్ ప్లాట్‌ఫారమ్ ద్వారా MSMEలు ఎక్కువగా అధికారికంగా నమోదయ్యాయి. ఎగుమతులు, ముఖ్యంగా మొబైల్, కెమికల్స్, మెటల్స్, మెషినరీ రంగాల్లో వృద్ధి కనిపిస్తోంది.

అయితే తయారీ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు కొన్ని ఉన్నాయి. విద్యుత్, రవాణా, ముడిసరుకు ధరలు పెరగటం వల్ల ఉత్పత్తి ఖర్చులు అధికం అవుతున్నాయి. బ్యాంకు రుణాల కోసం ఎక్కువ భరోసా అవసరం అవుతున్నది. పరిశ్రమల దగ్గర వృత్తి శిక్షణా కేంద్రాల కొరత ఎక్కువ. మౌలిక వసతుల లోపం ఉన్నది. విధానాల విషయంలో అస్పష్టత నెలకొన్నది. అన్ని రంగాలను ఒకే దృష్టితో చూడడం వలన తయారీ రంగం వెనుకబడుతున్నది.

స్పష్టమైన తయారీ విధానం ఈ సమస్యలకు పరిష్కారం. జాతీయ తయారీ అభివృద్ధి మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ప్రతి సంవత్సరం లక్ష్యాలను ప్రకటించాలి. తయారీ రంగానికి చెందిన MSMEలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలి. సాంకేతికత, ఆధునికీకరణ కోసం ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ప్రాంతీయ పరిశ్రమల పార్కులను అంతర్జాతీయ ప్రమాణాల మేరకు అభివృద్ధి చేయాలి. రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ వ్యయాన్ని జీడీపీలో 0.7శాతం నుంచి కనీసం 2.5శాతం వరకు పెంచాలి. నాణ్యతా ప్రమాణాలు, ఎగుమతి ప్రోత్సాహకాలు, ఆన్‌లైన్ సేవల ద్వారా అనుమతులు విస్తరించాలి. ఉద్యోగాధారిత పన్ను రాయితీలు ఇవ్వాలి. ఎక్కువ మంది కార్మికులను నియమించే యూనిట్లకు ఆటోమేటిక్ ఇన్సెంటివ్‌లు ఇవ్వాలి.

తయారీ రంగం దేశ ఆత్మనిర్భరతకు, సాంకేతిక ప్రగతికి, సామాజిక స్థిరత్వానికి పునాది. భారతదేశం నిజంగా వికసిత భారత్‌గా ఎదగాలంటే, తయారీ రంగాన్ని సేవలు, ఐటీ, పర్యాటక రంగాలతో కలపకుండా, ప్రత్యేక విధానం, బడ్జెట్, ప్రాధాన్యంతో అభివృద్ధి చేయాలి.

జి.నానిబాబు చౌదరి

ప్రధాన కార్యదర్శి, మల్లవల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్

Also Read:

జోగి రమేష్ బ్రదర్స్‌కు దక్కని ఊరట

పాలిచ్చే స్త్రీలు థైరాయిడ్ మందులు తీసుకోవచ్చా?

Updated Date - Dec 19 , 2025 | 02:18 AM