ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana Education: పాఠశాలల కన్నా గోశాలలపైన మక్కువ

ABN, Publish Date - Jul 08 , 2025 | 01:07 AM

2023 లెక్కల ప్రకారం దేశంలో 18 సంవత్సరాలలోపు పిల్లలు 43.66 కోట్ల మంది ఉండగా, తెలంగాణలో 67.26 లక్షలు ఉన్నారు.

2023 లెక్కల ప్రకారం దేశంలో 18 సంవత్సరాలలోపు పిల్లలు 43.66 కోట్ల మంది ఉండగా, తెలంగాణలో 67.26 లక్షలు ఉన్నారు. ఇక దేశంలో పశువులు 53.67 కోట్లు ఉండగా, తెలంగాణలో 3.26 కోట్లు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు గోశాలల ఏర్పాటు, నిర్వహణ మొత్తం ప్రైవేటు వ్యక్తులు, ధార్మిక సంస్థలు, హిందూ మత అనుబంధ మఠాలు మాత్రమే నిర్వహిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు అనేక ప్రోత్సాహకాలు ఇప్పటికే ఇస్తున్నాయి.

పశుసంవర్ధక శాఖ లెక్కల ప్రకారం గోశాలల నిర్వహణదారులు సగటున ఒక్కో సాధారణ ఆవుకు రోజుకు రూ.100, పాడి ఆవుకు రూ.229 దాణా కోసం ఖర్చు చేయాలి. ప్రభుత్వం పాఠశాల, కళాశాలల విద్యార్థులకు జీఓ 9 ప్రకారం పెంచిన మెస్ చార్జీల 1–7వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.1330, రోజుకు 44.33; 8–10వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.1540, రోజుకు 51.33; ఇంటర్ ఆపై విద్యార్థులకు నెలకు రూ.2100 రోజుకు 70 రూపాయలు ఖర్చు చేస్తున్నది. ఈ లెక్కన ఒక్కో ఆవుపై పెట్టే ఖర్చు కన్నా విద్యార్థిపై పెట్టే ఖర్చు తక్కువ. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు 25 ఎకరాలు కేటాయిస్తుండగా, గోశాలలకు 100 ఎకరాలు కేటాయించ తలపెట్టారు. అధికారంలోకి రాగానే విద్యారంగానికి 15 శాతం బడ్జెట్ కేటాయింపులు చేస్తామని చేవెళ్ళలో కాంగ్రెస్ డిక్లరేషన్ చేసినా, విద్యారంగానికి 2024–25లో 7.3శాతం, 2025–26లో 7.55శాతం మాత్రమే బడ్జెట్ కేటాయింపులు చేశారు.

విద్యార్థి కేంద్రంగా ఉండవలసిన పాఠశాలలను, గడచిన ఇరవయ్యేళ్ళ నుంచి టీచర్ కేంద్రంగా మార్చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలన్నీ టీచర్ల రాకపోకలకు, బోధనకు అనుకూలమే తప్ప, ఎక్కడ కూడా విద్యార్థిని కేంద్రం చేసుకొని పాఠశాలల నిర్వహణ, బోధన, మూల్యాంకన ప్రణాళికలు లేవు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి భరోసా లేకపోవడంతో, ఈ పాఠశాలల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రుల అనాసక్తిని ప్రదర్శిస్తున్నారు. గురుకులాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థి భవిష్యత్తు దిశగా చేస్తున్న చర్చలు, ఆలోచనలు కార్యక్రమాలు కంటి తుడుపు చర్యలే కానీ, విద్యార్థి భవిష్యత్తుకు భరోసా ఇచ్చేవి కావు.

గోశాలల ఏర్పాటు పట్ల ఎవరికీ అభ్యంతరం ఉండదు. వ్యాపార దృక్పథంతో చూడాల్సిన ఆవుల పెంపకాన్ని ప్రభుత్వం సామాజిక దృక్పథంతో ప్రాధాన్యం ఇస్తున్నది. సామాజిక బాధ్యతతో నిర్వహించాల్సిన పాఠశాల విద్యను వ్యాపార దృక్పథంలోకి నెట్టివేస్తున్నది. సమాజానికి ఇది ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వృత్తి విద్యకోర్సుల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో, ఎన్నికల్లో ప్రత్యేక కోటా చట్టమొక్కటే శరణ్యమని గుర్తించాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గోశాలల పితామహుడిగా కన్నా, ప్రభుత్వ పాఠశాలల పితామహుడిగా నిలవడం శ్రేష్ఠం.

– మామిడి నారాయణ,

సెంటర్ ఫర్ బెటర్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్

Updated Date - Jul 08 , 2025 | 01:07 AM