ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Concerns Over MGNREGA Changes: ఉపాధికి హామీ లేని పథకం

ABN, Publish Date - Dec 18 , 2025 | 05:46 AM

ఉపాధికి హామీ ఇచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇకపై తన పేరు, రూపు మార్చుకోబోతోంది. ఆ దిశగా రూపొందించిన బిల్లుని కేంద్రం పార్లమెంట్ సభ్యులకు...

ఉపాధికి హామీ ఇచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇకపై తన పేరు, రూపు మార్చుకోబోతోంది. ఆ దిశగా రూపొందించిన బిల్లుని కేంద్రం పార్లమెంట్ సభ్యులకు అందజేసింది. ఇందులో ప్రతిపాదనలు ఇంతవరకూ ఉన్న హామీని నీరుకార్చేవిగా ఉన్నాయి. వంద రోజుల పని దినాలకు బదులు 125 రోజులు పని కల్పిస్తామని చెప్పడం ఒక్కటే బాగుంది.

ఈ పథకాన్ని డిమాండ్ ఆధారంగా కాకుండా సరఫరా ఆధారంగా చెయ్యడం ఇప్పుడు చేస్తున్న పెద్ద మార్పు. అంటే ఇప్పటిలా మా ఊరికి ఈ పని, ఇంతమందికి ఉపాధి కల్పిస్తూ, ఇన్ని రోజులకు అవసరం అని చెప్తే కేంద్రం మంజూరు చెయ్యడం కాదు. కేంద్రం ఇచ్చిన బడ్జెట్ మేరకు, కేంద్రమే గుర్తించిన ప్రాంతంలో ఆ పని పూర్తి అయ్యేలా చూడడమే. ఈ మార్పు వల్ల స్థానికులకు, ఆ రాష్ట్రాలకు డిమాండ్ చేసే స్వేచ్ఛ లేదు. పైగా కేంద్రం ఇస్తున్న నిధులను 60శాతానికి తగ్గించడం, రాష్ట్రం వాటా 40శాతానికి పెంచడం. దీంతో రాష్ట్రాలపై ఆర్థిక భారంతో పాటు, అమలులో ఉదాసీనత, సర్దుబాటు ధోరణి పెరుగుతుంది. ఇంతకుముందు వ్యవసాయ పనుల సీజన్‌లో కూడా ఈ పథకం ఉండడం వల్ల వ్యవసాయ కార్మికులకు డిమాండ్ ఉండి మెరుగైన వేతనాలు దక్కేవి. ఇప్పుడు ఆ సీజన్‌లో ఈ పథకం ఉండదు.

ఉదారంగా నిధులు కేటాయించి, పటిష్టంగా అమలు చేయడం ద్వారా గ్రామీణ భారతాన్ని ఆదుకోవాల్సిన కేంద్రం, ఈ మార్పులతో ఏ ఫలితాన్ని ఆశిస్తుందో తెలియడం లేదు. అన్ని రాష్ట్రాల్నీ ఒకే గాటన కట్టకుండా అమలులో మంచి పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలకు, ఆదాయం తక్కువ ఉన్న రాష్ట్రాలకు పాత పద్ధతిలో 90 శాతం నిధులు కేటాయించినా బాగుంటుంది. ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. వికసిత భారత్ అన్నది బిల్లు పేరులోనే కాకుండా చట్టం స్ఫూర్తిలో కనబడాలి.

డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ

Also Read:

జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి

ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?

Updated Date - Dec 18 , 2025 | 05:46 AM