ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ రాశి వారికి ఈ వారం ఖర్చులు విపరీతం..

ABN, Publish Date - Aug 31 , 2025 | 07:24 AM

ఆ రాశి వారికి ఈ వారం ఖర్చులు విపరీతంగా ఉంటాయని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. లావాదేవీలపై శ్రద్ధ పెట్టాలని, తొందరపాటు నిర్ణయం నష్టం కలిగిస్తుందని తెలుపుతున్నారు. గ్రహస్థితి సామాన్యమని, ఆచి తూచి అడుగేయడం మంచిదని సూచిస్తున్నారు. ఇంకా.. ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...

అనుగ్రహం

31 ఆగస్టు - 6 సెప్టెంబర్‌ 2025

పి.ప్రసూనా రామన్‌

మేషం

అశ్విని, భరణి,

కృత్తిక 1వ పాదం

ప్రతికూలతలు అధికం. శ్రమిం చినా ఫలితం ఉండదు. అవకాశాలు చేజారి పోతాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు విపరీతం. అవసరాలు అతికష్టంమ్మీద తీరు తాయి. సామరస్యంగా మెలగండి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. ముఖ్యమైన పత్రాలు అందుకుం టారు. మానసికంగా కుదుటపడతారు. దైవకార్యం, విందులకు హాజరవుతారు.

వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి,

మృగశిర 1,2 పాదాలు

కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను ఓ కంట కనిపెట్టండి. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఎవరినీ తప్పుపట్టవద్దు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.

మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర,

పునర్వసు 1,2,3 పాదాలు

లావాదేవీలతో తీరిక ఉండదు. సంప్రదింపులు సజావుగా సాగుతాయి. ఒక సమాచారం ఊరటనిస్తుంది. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు విపరీతం. మొండి బాకీలు వసూలవుతాయి. వివాహ యత్నం ఫలిస్తుంది. కొత్తపనులు చేపడతారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. అందరితోనూ మితంగా సంభాషించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు.

కర్కాటకం

పునర్వసు 4వ

పాదం, పుష్యమి, ఆశ్లేష

ధైర్యంగా అడుగు ముందుకే స్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కష్టమ నుకున్న పనులు తేలికగా పూర్తిచేస్తారు. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. బాధ్యతలు అప్పగించి అవస్థపడతారు. ప్రముఖులతో సంభాషిస్తారు. మీ అభిప్రాయాలనులౌక్యంగా తెలియజేయండి. ఆగ్రహావేశాలకు లోనుకా వద్దు. ఆత్మీయుల చొరవతో సమస్య సద్దు మణుగుతుంది. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. స్నేహసంబంధాలు బలపడతాయి.

సింహం

మఖ, పుబ్బ,

ఉత్తర 1వ పాదం

వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒంటెద్దు పోకడ తగదు. నిపుణు లను సంప్రదించండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు. అవకాశాలు చేజారిపోతాయి. పెద్దల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. కొత్త యత్నాలు చేపడతారు. మీ కృషి ఫలిస్తుంది. లక్ష్యానికి చేరువవుతారు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడపుతారు.

కన్య

ఉత్తర 2,3,4; హస్త,

చిత్త 1,2 పాదాలు

అనుకూలతలు నెలకొంటాయి. సంకల్పబలంతో అడుగు ముందుకేస్తారు. అదృష్టయోగం ఉంది. కొన్ని అవకాశాలు ఆక స్మికంగా కలిసివస్తాయి. వ్యతిరేకులు చేరువ వుతారు. పనులు త్వరితగతిన సాగుతాయి. పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. చుట్టుపక్కల వారిని గమనించండి. శుభకార్యా నికి సన్నాహాలు సాగిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. మీ సాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది.

తుల

చిత్త 3,4; స్వాతి,

విశాఖ 1,2,3 పాదాలు

కార్యసాధనకు మరింత శ్రమించాలి. సమయస్ఫూర్తితో మెలగండి. పొగడ్తలకు పొంగిపోవద్దు. రాబోయే ఆదాయా నికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. అనుభవజ్ఞు లను సంప్రదించండి. పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యలను కలిసినా ఫలితం ఉండదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిధైర్యంతో యత్నాలు సాగిస్తారు. మాట తీరు ఆకట్టుకుంటుంది. బాధ్యతలు అప్పగించ వద్దు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు.

వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

మీ అభిరుచికి తగిన వ్యక్తు లతో పరిచయాలేర్పడతాయి. ఆటుపోట్లకు దీటుగా స్పందిస్తారు. ప్రతిభాపాటవాలు వెలు గులోకి వస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవు తారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందు తుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. మీ చొరవతో ఒక సమస్య పరిష్కార మవుతుంది. కొందరి రాక ఇబ్బంది కలిగి స్తుంది. పనులు ఒక పట్టాన సాగవు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.

ధనుస్సు

మూల, పూర్వాషాఢ,

ఉత్తరాషాఢ 1వ పాదం

శుభవార్త వింటారు. తల పెట్టిన కార్యం నెరవేరుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. ఆప్తులకు సాయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. కావలసిన వస్తువులు సమయానికి కనిపించవు. చిన్న విషయానికే చికాకుపడతారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి.

మకరం

ఉత్తరాషాఢ 2,3,4;

శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

గ్రహస్థితి సామాన్యం. ఆచి తూచి అడుగేయండి. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. ఒత్తిడికి గురి కావద్దు. దుబారా ఖర్చులు విపరీతం. కొత్త యత్నాలు చేపడతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పిల్లలకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. గృహమరమ్మతులు చేపడతారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.

కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

అనుకూలతలు అంతంత మాత్రమే. ఆచితూచి అడుగేయండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. అవకాశాలు చేజారిపోతాయి. సంకల్పబలంతో ముందుకు సాగండి. ఈ చికాకులు తాత్కాలికమే. పరి స్థితులు త్వరలో చక్కబడతాయి. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. ముఖ్యల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఆలోచనలతో సతమతమవుతారు. అపరిచితులతో మితంగా సంభాషించండి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

మీనం

పూర్వాభాద్ర 4వ

పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

లావాదేవీలపై శ్రద్ధ పెట్టండి. తొందరపాటు నిర్ణయం నష్టం కలిగిస్తుంది.. నిపుణుల సలహా పాటించండి. భేషజాలకు పోవద్దు. అవకాశాలను తక్షణం అందిపుచ్చు కోండి. ఖర్చులు విపరీతం. ఆపత్సమయంలో సన్నిహితులు ఆదుకుంటారు. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. నోటీసులు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావ నకు వస్తాయి. ఎదుటివారి ఆంతర్యం గ్రహిం చండి. ధార్మికత పెంపొందుతుంది.

Updated Date - Aug 31 , 2025 | 07:24 AM