ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ రాశి వారికి ఈ వారం అంతా డబ్బే డబ్బు..

ABN, Publish Date - Sep 07 , 2025 | 07:40 AM

ఆ రాశి వారికి ఈ వారం ధనలాభం అధికంగా ఉంటుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే.. కార్యసాధనకు మరింత శ్రమించాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. అంతేగాక పెద్దమొత్తం ధనసహాయం తగదని, శుభకార్యానికి హాజరవుతారని తెలుపుతున్నారు.

అనుగ్రహం

7 - 13 సెప్టెంబర్‌ 2025

పి.ప్రసూనా రామన్‌

మేషం

అశ్విని, భరణి,

కృత్తిక 1వ పాదం

కార్యసిద్ధికి సంకల్పబలం ముఖ్యం. యత్నాలు విరమించుకోవద్దు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. చేబదుళ్లు స్వీకరిస్తారు. ఫోన్‌ సందేశాలు పట్టించుకోవద్దు. మీ ఇబ్బందు లను ఆప్తులకు తెలియజేయండి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా ముందుకు సాగుతారు. పత్రాల్లో సవరణలు అనుకూలి స్తాయి. గృహమరమ్మతులు చేపడతారు. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది.

వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి,

మృగశిర 1,2 పాదాలు

వ్యవహారానుకూలత ఉంది. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆదాయం బాగుంటుంది. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కలిసి వచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తారు. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. సేవా కార్యక్రమంలో పాల్గొంటారు.

మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర,

పునర్వసు 1,2,3 పాదాలు

గ్రహస్థితి అనుకూలం. ఇష్ట పడి శ్రమించి లక్ష్యం సాధిస్తారు. లావాదేవీలు సంతృప్తినిస్తాయి. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. చిట్స్‌, ప్రైవేట్‌ ఫైనాన్సుల జోలికి పోవద్దు. సంస్థల స్థాపనకు అనుకూలం. అర్థాంతరంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. సామరస్యంగా మెలగండి. ఆత్మీ యుల రాక ఊరటనిస్తుంది. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. వివాదాలు కొలిక్కి వస్తాయి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.

కర్కాటకం

పునర్వసు 4వ

పాదం, పుష్యమి, ఆశ్లేష

లక్ష్యసాధనకు మరింత శ్రమిం చాలి. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. పెద్దల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాప్యం తగదు. పరిచయం లేని వారితో జాగ్రత్త. పొగడ్తలకు పొంగిపోవద్దు. ఎదుటివారి ఆంత ర్యం గ్రహించండి. బంధుమిత్రులతో తరచూ సంభాషిస్తుంటారు. ముఖ్యమైన పత్రాలు చేతికందుతాయి. కొత్తయత్నాలు మొదలె డతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి.

సింహం

మఖ, పుబ్బ,

ఉత్తర 1వ పాదం

సంప్రదింపులతో తీరిక ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయటం శ్రేయస్కరం. పనులు అస్తవ్యస్తంగా సాగు తాయి. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. చీటికిమాటికి అసహనం చెందు తారు. సామరస్యంగా మెలగండి. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. శుభకార్యానికి హాజరవుతారు.

కన్య

ఉత్తర 2,3,4; హస్త,

చిత్త 1,2 పాదాలు

మీదైన రంగంలో శుభపరిణా మాలున్నాయి. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. అర్థాం తరంగా ముగించిన పనులు పూర్తిచేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. వ్యవహారాల్లో తొందరపాటు తగదు. అనుభవ జ్ఞులను సంప్రదించండి. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు.

తుల

చిత్త 3,4; స్వాతి,

విశాఖ 1,2,3 పాదాలు

ఆర్థికస్థితి సామాన్యం. ఆలో చనలు నిలకడగా ఉండవు. అన్యమనస్కంగా గడుపుతారు. అవసరాలు వాయిదా వేసుకుం టారు. పరిచయస్తుల రాక చికాకుపరుస్తుంది. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. శుభకార్యా నికి యత్నాలు సాగిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. పిల్లల దూకుడు వివాదాస్పదమవుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. రాజీమార్గంలో సమస్య పరిష్కారమవుతుంది.

వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

గ్రహయోగం బాగుంది. ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. చిట్స్‌, ప్రైవేట్‌ ఫైనాన్సుల జోలికి పోవద్దు. అనుభవజ్ఞులను సంప్రదిస్తారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతారు. శుభకార్యానికి హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.

ధనుస్సు

మూల, పూర్వాషాఢ,

ఉత్తరాషాఢ 1వ పాదం

ఆశావహదృక్పథంతో మెల గండి. పట్టుదలతో శ్రమిస్తేనే కార్యం సిద్థి స్తుంది. సాయం ఆశించవద్దు. మీ సామర్థ్యం పై నమ్మకం పెంచుకోండి. సకాలంలోపనులు పూర్తి చేస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చు లుంటాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. ఆందో ళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. అందరితోనూ మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు.

మకరం

ఉత్తరాషాఢ 2,3,4;

శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

కొత్తయత్నాలు మొదలెడతారు. కార్యసిద్థికి సంకల్పబలం ముఖ్యం. పరిచయ స్తుల వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. స్థిరాస్తి ధనం అందుకుంటారు. ఖర్చులు సామాన్యం. పెద్దమొత్తం ధనసహాయం తగదు. చేసిన పనులే తిరిగి చేయ వలసి వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. వివాహయత్నం ఫలిస్తుంది. తాహతుకు మించి హామీలివ్వవద్దు.

కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

లక్ష్యం సాధించే వరకు శ్రమిం చండి. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు, బాధ్య తలు స్వయంగా చూసుకోండి. ఆందోళన కలిగించే సంఘటన ఎదురవుతుంది. కార్య క్రమాలు వాయిదా పడతాయి. ఆపత్సమ యంలో సన్నిహితులు చేయూతనిస్తారు. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.

మీనం

పూర్వాభాద్ర 4వ

పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

కార్యసాధనకు మరింత శ్రమించాలి. సంకల్పబలంతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. ఫోన్‌ సందేశాలు పట్టించుకోవద్దు. మీ శ్రీమతికి అన్ని విష యాలు తెలియజేయండి. ఆప్తులతో తరచుగా సంభాషిస్తారు. నోటీసులు అందుకుంటారు.

Updated Date - Sep 07 , 2025 | 07:40 AM