ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Vijayawada Dasara Celebrations: కిక్కిరిసిపోతున్న ఇంద్రకీలాద్రి.. మధ్యాహ్నం సమయానికి ఎంతమంది దర్శించుకున్నారంటే..

ABN, Publish Date - Oct 02 , 2025 | 03:59 PM

ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రుల చివరి రోజున రాజరాజేశ్వరిదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

Vijayawada Dasara Celebrations 2025

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు(Vijayawada Dasara Mahotsavam 2025) అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రుల చివరి రోజున రాజరాజేశ్వరిదేవి (Rajarajeshwari Devi) అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. తెల్లవారుజాము నుంచే దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరించి రాజరాజేశ్వరి దేవి ఆశీస్సులు తీసుకుంటున్నారు. కాగా, ఉదయం నుంచే భక్తులు బారులు తీరడంతో క్యూలైన్లు కిక్కిరిపోతున్నాయి.

ఇవాళ(గురువారం) మధ్యాహ్నం 3 గంటల వరకు 94,723 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంకా, వేల మంది భక్తులు దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. మరోవైపు భవానీ మాలధారులు ఇంద్రకీలాద్రికి పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో క్యూలైన్లు మెుత్తం 'జై దుర్గా.. జైజై దుర్గా' నామస్మరణలతో మార్మోగిపోతున్నాయి. అయితే, భక్తుల కోసం అధికారులు సకల సౌకర్యాలూ కల్పించారు. వారికి మంచినీళ్లు, మజ్జిగ, పాలు వంటివి అందిస్తున్నారు. కాగా, ఇవాళ రాత్రి 11 గంటల వరకూ అమ్మవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు అధికారులు.

ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధర తగ్గేదేలే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

టాప్ ప్లేస్‌లో అంబానీ.. దేశంలో అత్యంత సంపన్నులు వీరే..

Updated Date - Oct 02 , 2025 | 04:02 PM