ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Varamahalakshmi Vratham Story 2025: వరలక్ష్మీ వ్రతం.. ఈ అద్భుత కథ మీకు తెలుసా?

ABN, Publish Date - Aug 08 , 2025 | 10:45 AM

వివాహిత స్త్రీలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున, వరలక్ష్మీ రూపంలోని లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే, ఈ వరలక్ష్మీ వ్రతం ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న కథేంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Varamahalakshmi Vratham Story

ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజున మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం చేస్తే లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయని, ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. అయితే, ఈ వరలక్ష్మీ వ్రతం ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న కథంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

వరలక్ష్మీ వ్రతం కథ

పురాణాల ప్రకారం చారుమతి అనే స్త్రీ తన భర్త, కుటుంబంతో మగధ దేశంలోని భద్రశ్రీ నగరంలో నివసించేది. ఆమె చాలా భక్తిపరురాలు. తన భర్త పట్ల ఎంతో అంకితభావం, సేవా దృక్పథం కలిగి ఉండేది. చారుమతి క్రమం తప్పకుండా లక్ష్మీదేవిని భక్తితో పూజించేది. ఆమె భక్తి, విశ్వాసంతో మెచ్చిన లక్ష్మీదేవి సదరు మహిళ కలలో కనిపించి, శ్రావణ శుక్ల పక్ష శుక్రవారం ఉపవాసం ఉండి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే.. అదృష్టం, సంపద, శ్రేయస్సు లభిస్తాయని చెబుతుంది. కల నుంచి మేల్కొన్న తర్వాత చారుమతి తన స్నేహితులు, నగరంలోని ఇతర మహిళలకు ఈ ఉపవాసం గురించి చెప్పింది. అందరూ కలిసి ఆచారాల ప్రకారం ఉపవాసం పాటించారు. ఫలితంగా, అందరి ఇళ్లలో సంపద, ఆనందం, శ్రేయస్సు, అదృష్టం కలుగుతాయి. అప్పటి నుంచి ఈ వరలక్ష్మీ వ్రతంగా ప్రాచుర్యం పొందింది.

వరలక్ష్మీ వ్రతం అంటే ఏమిటి?

వర అంటే వరం. లక్ష్మీ అంటే సంపద, వైభవం, శ్రేయస్సుకు దేవత. వరలక్ష్మీ వ్రతం ఉద్దేశ్యం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం. కుటుంబం ఆనందం, శాంతి, సంపద, ఆరోగ్యం, రక్షణ కోసం ఆమె ఆశీర్వాదాలను పొందడం. వివాహితలు ముఖ్యంగా తమ భర్త, పిల్లలు, కుటుంబం సంతోషంగా ఉండటానికి ఈ ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు.

వరలక్ష్మీ వ్రతం ప్రాముఖ్యత

వరలక్ష్మీ వ్రతం.. ముఖ్య ఉద్దేశ్యం లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడం. ఈ ఉపవాసం పాటించడం ద్వారా ఒక వ్యక్తికి అష్టలక్ష్మి (సంపద, శ్రేయస్సు, శక్తి, భూమి, జ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి) ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. ఈ ఉపవాసం వివాహిత మహిళలకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది భర్త అదృష్టం, దీర్ఘాయువు కోసం ఆచరిస్తారు.

Also Read:

వరమహాలక్ష్మి పండుగ రోజు ఆకుపచ్చ గాజులు ఎందుకు ధరిస్తారు?

వరమహాలక్ష్మి వ్రతంలో ఈ తప్పులు చేయకండి

For More Latest News

Updated Date - Aug 08 , 2025 | 12:08 PM