Varamahalakshmi Pooja 2025: వరమహాలక్ష్మి వ్రతంలో ఈ తప్పులు చేయకండి
ABN , Publish Date - Aug 08 , 2025 | 09:19 AM
వరమహాలక్ష్మి పండుగ కావడంతో ఈ రోజున చాలా మంది మహిళలు ఉపవాసం ఉంటారు. అయితే, ఈ ఉపవాస దినంలో కొన్ని చేయకూడని తప్పులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజున వరలక్ష్మీ వత్రం. అంటే వరాలను ఇచ్చే లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తారు. హిందూ సంప్రదాయంలో, ఈ రోజుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మహిళలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు వరలక్ష్మీ వ్రతం చేస్తారు. అంతేకాకుండా, సిరుల తల్లి లక్ష్మీదేవిని భక్తితో పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం. ఈ రోజున చాలా మంది మహిళలు ఉపవాసం ఉంటారు. అయితే, ఈ రోజున కొన్ని చేయకూడని తప్పులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ తప్పులు చేయకండి:
వరమహాలక్ష్మి పండుగ రోజున, విరిగిన విగ్రహాలను పూజా స్థలంలో లేదా ఆలయంలో ఉంచకూడదు.
వరమహాలక్ష్మిని చెక్క కుర్చీపై కూర్చోబెట్టండి. ఎట్టిపరిస్థితిలోనూ, లక్ష్మిదేవిని ఇనుప కుర్చీపై కూర్చోబెట్టకూడదు.
వరలక్ష్మి వ్రతంలో అలంకరణ కోసం ప్లాస్టిక్ పూలు, పండ్లను ఉపయోగించవద్దు.
మీ ఇంట్లో కలశంతో పూజించే ఆచారం లేకపోతే, మీరు భక్తులైనా కూడా కలశంతో పూజ చేయకండి. మీరు లక్ష్మీ ఫోటోను పూజించినా, అమ్మవారి అనుగ్రహం మీకు లభిస్తుంది.
మీరు కలశంతో పూజ చేయబోతున్నట్లయితే, తరమతో చేసిన కలశం ఉపయోగించడం మంచిది. పూజ సమయంలో మీ మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోండి. చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి.
ఈ పండుగకు అప్పుగా తీసుకున్న డబ్బు లేదా నగలు ఉపయోగించవద్దు. దీనివల్ల లక్ష్మీదేవి కూడా మనస్తాపం చెందుతుంది. అలాగే, తుప్పు పట్టిన నగలను ఎప్పుడూ ఉపయోగించవద్దు.
నైవేద్యానికి ఉపయోగించే పదార్థాలు శుభ్రంగా ఉండాలి. అలాగే, నైవేద్యం పెట్టే పాత్రలు కూడా పరిశుభ్రంగా ఉండాలి.
నైవేద్యం పెట్టేటప్పుడు సరైన పద్ధతి పాటించాలి. దీపారాధన చేసి, నైవేద్యం పెట్టి, పూజ చేయాలి. నైవేద్యంలో ఇతర పదార్థాలు కలపకూడదు.
నైవేద్యం పెట్టే ముందు, చేతులు, కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాలు పెట్టండి.
పులిహోర, గారెలు, బూరెలు, పరమాన్నం, వడపప్పు, పానకం, శనగలు, చలిమిడి వంటి సాంప్రదాయ ప్రసాదాలు పెట్టడం మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వరలక్ష్మీ దేవి అనుగ్రహం పొందవచ్చు.
Also Read:
వరమహాలక్ష్మి పండుగ రోజు ఆకుపచ్చ గాజులు ఎందుకు ధరిస్తారు?
ఇంట్లో వరమహాలక్ష్మిని ఈ సాధారణ పద్ధతిలో పూజించండి
For More Latest News