ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ రాశి వారికి ఈ వారం డబ్బే డబ్బు...

ABN, Publish Date - Nov 02 , 2025 | 07:37 AM

ఆ రాశి వారికి ఈ వారం డబ్బే డబ్బు... అని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే...కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. రావాల్సిన ధనం ఆలస్యంగా అందుతుందని, కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు.

ఆ రాశి వారికి ఈ వారం డబ్బే డబ్బు... అని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే...కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. రావాల్సిన ధనం ఆలస్యంగా అందుతుందని, కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు.

అనుగ్రహం

2 - 8 నవంబర్‌ 2025

పి.ప్రసూనా రామన్‌

మేషం

అశ్విని, భరణి,

కృత్తిక 1వ పాదం

శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. అవ సరాలు వాయిదా వేసుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. అనాలోచిత నిర్ణయం తగదు. మీ తప్పిదాలు సరిదిద్దుకోవటానికి యత్నించండి.

వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి,

మృగశిర 1,2 పాదాలు

అన్నింటా మీదే పైచేయి. కీలక అంశాలపై పట్టుసాధిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. ధైర్యంగా ముందుకు సాగుతారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. కనిపించ కుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. గృహనిర్మాణం పూర్తి కావస్తుంది. పాతమిత్రులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది.

మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర,

పునర్వసు 1,2,3 పాదాలు

ప్రతికూలతలు అధికం. ఏ పని మొదలెట్టినా మొదటికే వస్తుంది. ఓర్పుతో యత్నాలు సాగించండి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. పట్టుదలతో శ్రమిస్తే మంచి ఫలితం ఉంటుంది. పరిచయం లేని వారితో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. బంధు వులతో విభేదాలు. సన్నిహితులకు మీ ఇబ్బందులు తెలియజేయండి. ఏ విషయానికీ అధైర్యపడవద్దు. శుభకార్యానికి హాజరుకాలేరు.

కర్కాటకం

పునర్వసు 4వ

పాదం, పుష్యమి, ఆశ్లేష

ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలి స్తాయి. సన్నిహితులతో తరుచూ సంభాషి స్తుంటారు. ఆటంకాలెదురైనా చేస్తున్న పనులు కొనసాగించండి. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయా లకు స్పందన లభిస్తుంది. అందరితోనూ ఆచితూచి సంభాషించండి. మీ వ్యాఖ్యలు కొందరికి మనస్తాపం కలిగిస్తాయి. విజ్ఞతతో సమస్య పరిష్కరించుకుంటారు.

సింహం

మఖ, పుబ్బ,

ఉత్తర 1వ పాదం

గత కొంతకాలంగా పడుతున్న ఇబ్బందులు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఆదాయానికి తగ్గట్టు ఖర్చు లుంటాయి. కొత్తయత్నాలు మొదలెడతారు. గుట్టుగా మెలగండి. పనులు ఒకపట్టాన సాగవు. చీటికిమాటికి అసహనం చెందు తారు. మీ పొరపాట్లు సరిదిద్దుకోండి. మీ అశక్తతను ఇతరులపై చూపవద్దు. వివాహ యత్నం ఫలించే సూచనలున్నాయి. మధ్యవర్తులను నమ్మవద్దు.

కన్య

ఉత్తర 2,3,4; హస్త,

చిత్త 1,2 పాదాలు

అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలు చేజారిపోతాయి. ఉత్సాహంగా ముందుకు సాగండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. మీ తప్పిదాలకు ఇతరులను నిందించవద్దు. విజ్ఞతతో మెలగండి. కొన్ని విషయాలు ఆందోళన కలిగిస్తాయి. చేస్తున్న పనులు అర్థాంతరంగా ముగిస్తారు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. అనవసర జోక్యం తగదు.

తుల

చిత్త 3,4; స్వాతి,

విశాఖ 1,2,3 పాదాలు

ఆశావహదృక్పథంతో మెల గండి. లక్ష్యానికి చేరువవుతారు. ఽఅవసరాలు వాయిదా వేసుకుంటారు. ముఖ్యులను కలి సినా ఫలితం ఉండదు. ఓర్పుతో పనులు కొన సాగించండి. చిన్న విషయానికే చికాకు పడ తారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచు కోండి. అతిగా ఆలోచించొద్దు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. పత్రాల రెన్యువల్‌లో జాప్యం తగదు. ఆరోగ్యం బాగుంటుంది. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు.

వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

శుభవార్త వింటారు. తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. చాకచక్యంగా వ్యవ హరిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసు కుంటారు. పట్టింపులకు పోవద్దు. సహనమే మీకు శ్రీరామరక్ష. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. నోటీసులు అందు కుంటారు. న్యాయనిపుణులను సంప్రదిస్తారు.

ధనుస్సు

మూల, పూర్వాషాఢ,

ఉత్తరాషాఢ 1వ పాదం

సర్వత్రా అనుకూలమే. మాట నిలబెట్టుకుంటారు. పరిచయస్తులు మీ చిత్తశుద్ధిని ప్రశంసిస్తారు. మీపై అభియోగాలు తొలగిపోగలవు. పనులు హడావుడిగా సాగు తాయి. ప్రణాళికలు వేసుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. చిన్ననాటి పరిచయస్తులతో సంభాషిస్తారు. ఒక సంఘటన మీపై ప్రభావం చూపుతుంది. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగు తుంది. శుభకార్యానికి హాజరవుతారు.

మకరం

ఉత్తరాషాఢ 2,3,4;

శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

అనుకూలతలు అంతంత మాత్రమే. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమన స్కంగా గడుపుతారు. రుణఒత్తిడి ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు అధికం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చేసిన పనులే చేయవలసి వస్తుంది. మీ శ్రీమతి ప్రోద్బలంతో కొత్తయత్నాలు మొదలెడతారు. ఒక సమాచా రం ఉత్సాహపరుస్తుంది. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. దీక్షలు స్వీకరిస్తారు.

కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ సమస్య అనుకోవద్దు. సంకల్ప బలంతో శ్రమిేస్తనే లక్ష్యం సిద్థ్దిస్తుంది. ఆదా యానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. అంచ నాలు ఫలించవు. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి. ఆత్మీయుల హితవు కార్యోన్ము ఖులను చేస్తుంది. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. పనుల్లో ఆటంకాలెదురైనా కొనసా గించండి. అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి.

మీనం

పూర్వాభాద్ర 4వ

పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

కొంతమేరకు యోగదాయకం. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. దూరపు బంధుత్వాలు బలపడ తాయి. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. ఆదాయం బాగుంటుంది. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయం తగదు. నిపుణులను సంప్రదించండి. పనులు మొం డిగా పూర్తి చేస్తారు. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు.

Updated Date - Nov 02 , 2025 | 07:37 AM