ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ashadam: అమ్మ వారు పూజలందుకునే మాసం.. ఆషాఢం

ABN, Publish Date - Jun 25 , 2025 | 02:11 PM

ఆషాఢం.. శూన్య మాసం. దీంతో ఈ మాసంలో శుభకార్యాలు జరగవు. కానీ ఈ మాసంలో అమ్మవారు భక్తుల నుంచి పూజలందుకుంటుంది. ఈ మాసం ప్రారంభం నుంచే నవరాత్రలు ప్రారంభమవుతాయి.

ఏడాదికి 12 మాసాలున్నా.. ఏ మాసానికి ఆ మాసం ఒక విశిష్టత స్థానం ఉంది. ఆషాఢం. ఈ మాసాన్ని శూన్య మాసంగా పరిగణిస్తారు. ఆషాఢం.. జూన్ 26వ తేదీ నుంచి ప్రారంభమై జులై 24వ తేదీ అమావాస్యతో ఈ మాసం ముగియనుంది. మరి ముఖ్యంగా ఈ మాసంలో అమ్మవారు ప్రజల నుంచి పూజలందుకుంటుంది. ఆషాఢ మాసం ప్రారంభం నుంచి వరుసగా తొమ్మిది రోజుల పాటు గుప్త నవరాత్రుల పేరిట అమ్మవారిని భక్తి శ్రద్ధలతో భక్తులు ఆరాధిస్తారు. ఇక ఈ మాసంలో వచ్చే పర్వదినాలు.. ఆషాఢ శుద్ధ విదియ, ఆషాఢ శుద్ధ ఏకాదశి.. దీనినే తొలి ఏకాదశిగా పిలుస్తారు. ఈ మాసంలోనే తెలంగాణ ప్రాంతంలో బోనాలు నిర్వహిస్తారు. ఈ బోనాలును రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తారు.

ఆషాఢం అంటే..

తెలుగు సంవత్సరంలో నాలుగో నెలగా ఈ ఆషాఢం వస్తుంది. పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ, పూర్వాషాఢ నక్షత్రాల్లో సంచరించడం వల్ల ఈ మాసానికి ఆషాఢం అని పేరు వచ్చింది.

ఈ మాసంలో..

ఆషాఢం శూన్య మాసం కావడంతో ఎలాంటి శుభకార్యాలూ తలపెట్టరు. కానీ పూజా కార్యక్రమాలు, దేవతారాధనకు ఇది సరైన సమయం అంటారు. ఈ మాసంలోనే ప్రత్యక్ష నారాయణుడు మిథునరాశి నుంచి కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. అందువల్ల ఉత్తరాయణపుణ్యకాలం పూర్తయి.. దక్షిణాయనం ఆరంభమవుతుంది. ఈ మాసంలో పర్వదినాలు..

ఆషాఢ శుద్ధ విదియ..

ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయంలో స్వామి వారికి ఏడాదికి ఒకసారి భారీ ఎత్తున రథయాత్ర నిర్వహిస్తారు. ఈ రథయాత్ర ఆషాఢ శుద్ధ విదియ నాడు ప్రారంభమవుతుంది. అంటే జూన్ 27న ప్రారంభమై.. జులై 5వ తేదీతో ముగుస్తుంది. ఈ రథయాత్రలో పాల్గొనేందుకు దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీ చేరుకుంటారు. అందుకు తగ్గ ఏర్పాట్లను ఇప్పటికే ఒడిశా ప్రభుత్వం పూర్తి చేసింది.

ఆషాఢ శుద్ధ ఏకాదశి..

ఏడాదిలో ప్రతి నెలలో రెండు ఏకాదశలు వస్తాయన్న సంగతి అందరికి తెలిసిందే. కానీ ఆషాఢ మాసంలో వచ్చే శద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఈ పర్వదినం వేళ.. శ్రీమన్నారాయణుడు యోగనిద్రలోకి వెళ్లి నాలుగు మాసాల తర్వాత.. అంటే కార్తిక శుద్ధ ఏకాదశినాడు మేల్కుంటారని చెబుతారు. అందుకే దీనిని శయన ఏకాదశిగా పిలుస్తారు.

తెలంగాణలో బోనాలు..

ఈ మాసాన్ని తెలంగాణ ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆ జగన్మాతకు బోనాలు సమర్పిస్తారు. ఈ బోనాల వేడుకలు గోల్కొండ కోటలోని జగదాంబకి ఆలయంలో ప్రారంభమై.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి, లాల్‌దర్వాజా సింహవాహిని ఆలయాలతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ సాగుతాయి. గోల్కోండ కోటలో ఇవి ముగుస్తాయి.

గురు పూర్ణిమ..

ఈ మాసంలో వచ్చే పౌర్ణమిని గురుపూర్ణిమగా వ్యవహరిస్తారు. మహాభారతాన్ని రచించిన వేద వ్యాసుడు జన్మించిన రోజు ఇదే కావడంతో.. దీనిని వ్యాస పూర్ణిమగా వ్యవహరిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 25 , 2025 | 02:13 PM