ఆ రాశి వారికి ఈ వారం డబ్బే డబ్బు..
ABN, Publish Date - Sep 14 , 2025 | 07:17 AM
ఆ రాశి వారికి ఈ వారం డబ్బే డబ్బని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే... కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే.. నోటీసులు అందుకుంటారని, నిపుణులను సంప్రదిస్తారని తెలుపుతున్నారు. ఇంకా ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఆ రాశి వారికి ఈ వారం డబ్బే డబ్బని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే... కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే.. నోటీసులు అందుకుంటారని, నిపుణులను సంప్రదిస్తారని తెలుపుతున్నారు. ఇంకా ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
అనుగ్రహం
14 - 20 సెప్టెంబర్ 2025
పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. లక్ష్యానికి చేరువలో ఉన్నారు. ఓర్పుతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లింపుల్లో జాప్యం తగదు. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది.పనులు అప్పగించవద్దు. కొత్తవ్యక్తులతో మితంగా సం భాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. దైవకార్య సమావేశంలో పాల్గొంటారు.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు
మీదైన రంగంలో విశేష ఫలి తాలున్నాయి. అనుకున్నది సాధిస్తారు. ఆశ లొదిలేసుకున్న ధనం అందుతుంది. ఆర్భాటా లకు విపరీతంగా ఖర్చు చేస్తారు. స్నేహసం బంధాలు బలపడతాయి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఒత్తిడికి గురికావద్దు. కార్యక్రమాలు వాయిదా వేసుకోవటం శ్రేయస్కరం. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. ఉల్లాసంగా గడుపుతారు.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
లక్ష్యం సాధిస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మనోధైర్యంతో యత్నం కొనసాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆహ్వానం అందుకుంటారు. ఆరోగ్యం సంతృప్తికరం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు.
కర్కాటకం
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గ్రహాల సంచారం అను కూలంగా ఉంది. ఆలోచనలు కార్యరూపంలో పెట్టండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగ వద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. వాహనం కొనుగోలు చేస్తారు.
సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్తయత్నాలు మొదలెడతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ప్రముఖులతో సంప్ర దింపులు జరుపుతారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చు చేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. నోటీసులు అందుకుంటారు. నిపుణులను సంప్ర దిస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు.
కన్య
ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమిం చాలి. మీ కృషిలో లోపం లేకుండా చూసు కోండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే లక్ష్యం సాధిస్తారు. సంకల్పబలంతో చేేస యత్నాలు ఫలిస్తాయి. మీ శ్రీమతి ప్రోత్సా హం ఉంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. స్థిరచరాస్తి ధనం అందుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. బంధుమిత్రులతో తరచూ సంభాషిస్తారు.
తుల
చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
దృఢసంకల్పంతో లక్ష్యసాధనకు కృషిచేయండి. స్వశక్తితోనే లక్ష్యం సాధిస్తారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వ వద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లిం పుల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఆప్తుల కలయిక వీలుపడదు. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుం టారు. మీ శ్రీమతి ప్రమేయంతో ఒక సమస్య తొలగుతుంది. పిల్లల కదలికలపై దృష్టి ్టపెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. మీ సమర్థతపై నమ్మకం పెంచు కోండి. విమర్శలు పట్టించుకోవద్దు. స్థిరచరాస్తి ధనం అందుతుంది. ఆలయాలకు విరాళాలు, కానుకలు అందిస్తారు. అర్థాంతరంగా ముగించిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. అందరి తోనూ మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ మాటలు జారవేేస వ్యక్తులున్నారని గమనించండి.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
లక్ష్యానికి చేరువలో ఉన్నారు. ఆశావహదృక్పథంతో శ్రమించండి. సాయం ఆశించవద్దు. యత్నాలను సన్నిహితులు ప్రోత్సహిస్తారు. ఖర్చులు విపరీతం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పనులు మొదలు పెట్టే సమయానికి ఆటంకాలు ఎదురవుతాయి, శకునాలు పట్టించుకోవద్దు. ప్రముఖులను కలిసినా ఫలితం ఉండదు. పెద్దల వ్యాఖ్యలు మీపై ప్రభావం చూపుతాయి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
గ్రహస్థితి ప్రతికూలంగాఉంది. అవకాశాలు చేజారిపోతాయి. ఓర్పుతో యత్నాలు సాగించండి. మీ లక్ష్యం త్వరలో నెరవేరుతుంది. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యో న్ముఖులను చేస్తాయి. ఖర్చులు తగ్గించు కుంటారు. వాయిదాల చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. పిల్లలకు శుభఫలితాలు న్నాయి. ఆప్తులతో తరచూ సంభాషిస్తారు.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
సంప్రదింపులతో తీరిక ఉండదు. లక్ష్యం సాధించేవరకు శ్రమించకండి. ఇతరుల వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. కొంతమొత్తంధనం అందుతుంది. పొదుపు పథకాల పట్ల ఆకర్షితు లవుతారు. చిట్స్, ఫైనాన్సు రంగాల జోలికి పోవద్దు. పనులు ఒక పట్టాన సాగవు. చీటికి మాటికి అసహనం చెందుతారు. మీ ఆగ్రహా వేశాలు అదుపులో ఉంచుకోండి. మీ తప్పిదా లను సరిదిద్దుకోవటం శ్రేయస్కరం. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి.
మీనం
పూర్వాభాద్ర 4వ
పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆశావహదృక్పథంతో మెల గండి. సంకల్పబలంతోనే లక్ష్యం సాధ్యం. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచికే. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. ఆదాయం బాగుంటుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పరిచయస్తుల రాక అసౌకర్యం కలిగిస్తుంది. కార్యక్రమాలు,పనులు హడావుడిగా సాగుతాయి. వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయండి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
Updated Date - Sep 14 , 2025 | 07:17 AM