ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జూన్‌ 24.. ఆ రోజు ఉదయం 7 గంటలకు మొదలయ్యే...

ABN, Publish Date - Jun 15 , 2025 | 01:39 PM

జూన్‌ 24... ఆ రోజు సూర్యుడు భూమికి అత్యంత దూరంగా ఉండే రోజు. భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన ఈ విషయం అందరికీ ఓ వార్త. కానీ దక్షిణ అమెరికాలో రెండో అతిపెద్ద పండగ ‘ఇంతి రాయిమీ’ని ఈ రోజే జరుపుకొంటారు.

- సూర్యుడి సేవలో...

జూన్‌ 24... ఆ రోజు సూర్యుడు భూమికి అత్యంత దూరంగా ఉండే రోజు. భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన ఈ విషయం అందరికీ ఓ వార్త. కానీ దక్షిణ అమెరికాలో రెండో అతిపెద్ద పండగ ‘ఇంతి రాయిమీ’ని ఈ రోజే జరుపుకొంటారు. స్థానిక భాషలో ‘ఇంతి’ అంటే సూర్యుడు. ఆండియన్‌ పర్వత ప్రాంత తెగకు చెందినవారు ఇంతి రాయిమీని జరుపుకొంటారు. అయితే ఈ పండగకు సంబంధించి అద్భుత వేడుకలను చూడాలంటే మాత్రం పెరూలోని కుస్కో నగరానికి వెళ్లాలి. అక్కడి ‘సక్‌స్కాహువామన్‌’ శిథిలాల్లో అసలుసిసలు జాతర ఉంటుంది. అలనాటి ఇన్కా చక్రవర్తి, ఆయన పరివారం, సైన్యాన్ని తలపిస్తూ కళాకారులు పేద్ద ఊరేగింపుగా వస్తారు.

ఉదయం 7 గంటలకు మొదలయ్యే ఈ తంతు సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు చక్రవర్తి సూర్యుడికి వందనం సమర్పిస్తూ, ప్రజలకు సంబంధించి ఉపన్యాసం చేస్తాడు. తమ జీవితాల్లో ఎక్కువ కాంతిని నింపే రోజుల్ని ఇవ్వమని సూర్యుడిని ప్రార్థిస్తాడు. ఈ సందర్భంగా ఇంతుడికి ప్రత్యేక నైవేద్యాలనూ సమర్పిస్తారు. రాజ పరివారాన్ని తలిపించేలా బంగారం, వెండిని పోలిన నగలను ధరిస్తారు. ఇంతియామికి తొమ్మిది రోజుల ముందే ఈ రిహార్సల్స్‌ మొదలవుతాయి. సాయంకాలం నృత్య గానాలు, విందు వినోదాలతో సందడిగా ఉంటుంది. వందల ఏళ్లుగా సాగుతోన్న ఈ ఉత్సవాలను చూడడానికి రెండు కళ్లు చాలవు.

Updated Date - Jun 15 , 2025 | 01:39 PM