Ashadha Amavasya: ఆషాఢ అమావాస్య రోజు.. ఇలా చేయండి చాలు..
ABN, Publish Date - Jul 15 , 2025 | 06:06 PM
పితృదోషం వల్ల అనేక సమస్యలు కలుగుతాయి. ఇంట్లో నిత్యం ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. ఇంకా చెప్పాలంటే.. ఇంట్లో అశాంతి రాజ్యమేలుతుంది. అలాంటి వేళ పితృదోషం తొలగాలంటే.. ఈ విధంగా చేయాలని చెబుతున్నారు.
మరణానంతరం పితృదేవతలను సరిగ్గా గౌరవించకుంటే.. కుటుంబం పలు విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దీనినే పితృదోషం అంటారు. జ్యోతిష్య శాస్త్రంలో పితృ దోషాన్ని ప్రధాన దోషంగా పరిగణిస్తారు. ఇది వ్యక్తితోపాటు అతడి కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెబుతారు.
మతపరమైన ఆచారాలు ముఖ్యమైనవి..
మన వంశంలోని మరణించిన వారికి మతపరమైన ఆచారాలు.. అంటే శ్రద్ధ లేదా తర్పణ సకాలంలో నిర్వహించాల్సి ఉంటుంది. అలా చేయకుంటే.. పితృదోషం అంటుకుంటుంది. కుటుంబ సభ్యుల్లో అకాల మరణం సంభవిస్తే.. వారు మోక్షాన్ని పొందలేరు. వారి కోరికలు నెరవేరకుంటే.. వారి జీవితంలో ఏదైనా పాపం చేసి ఉంటే.. అది వారి భవిష్యత్ తరాలను ప్రభావితం చేస్తుంది.
ఆ దోషాన్ని తొలగించుకోవడానికి ఇదే సరైన సమయం..
ఈ పితృ దోష నివారణకు జ్యోతిష శాస్త్రం, గ్రంథాల్లో అనేక నివారణోపాయాలు ప్రస్తావించారు. వీటిని నమ్మకంగా పాటించడం ద్వారా ఆ దోష ప్రభావం తగ్గుతుంది. అంతేకాదు.. జీవితంలో సానుకూల మార్పులు సైతం సంభవిస్తాయి. ప్రస్తుతం జులై మాసంలో ఆషాఢ అమావాస్య వస్తుంది. అంటే శ్రావణ మాసం ప్రారంభానికి ఒక రోజు ముందు వచ్చే ఈ రోజు.. పూర్వీకులకు నీరుతోపాటు నల్ల నువ్వులను సమర్పించాలి. ఇది పూర్వీకులకు శాంతిని కలిగిస్తుంది.
తాటి చెట్టు కింద దీపం వెలిగించాలి..
మధ్యాహ్నం, రావి చెట్టుకు నీరు పోయాలి. పువ్వులు, అక్షత, పాలు, గంగా జలంతోపాటు నల్ల నువ్వులు సమర్పించడం ద్వారా మీ పూర్వీకులను స్మరించుకోవాలి. సాయంత్రం అరలి చెట్టు కింద దీపం వెలిగించాలి. ప్రతి రోజు.. ఒక ఆవు, కుక్క, కాకికి ఆహారం పెట్టండి (వీటిని పూర్వీకుల చిహ్నంగా పరిగణిస్తారు). ఇంటి దక్షిణ భాగంలో మీ పూర్వీకుల చిత్రాన్ని ఉంచండి. ప్రతిరోజూ వారికి దండలు సమర్పించి.. నమస్కారం చేయాలి.
పూర్వీకుల పట్ల అగౌరవం..
పూర్వీకులను అవమానించినట్లయితే లేదా విస్మరించినట్లయితే.. కుటుంబ సంప్రదాయాలు, మతపరమైన ఆచారాలు పాటించకుంటే.. పితృదోషం సంప్రాప్తిస్తుందంటారు. అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారం.. జాతకంలో సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి, కుజుడు, శని వంటి గ్రహాల నిర్దిష్ట స్థానం వల్ల లేదా రాహు - కేతువుల ప్రభావం వల్ల పితృ దోషం సంభవిస్తుందని నమ్ముతారు.
కుటుంబంలో ఈ సమస్యలన్నీ..
పితృ దోషం కారణంగా.. ఒక వ్యక్తి జీవితంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. వివాహ అనుకూలత లేదా సంఘర్షణలో నిరంతర ఇబ్బందులు కలుగుతాయి. ఆ తర్వాత వైవాహిక జీవితంలో ఒత్తిడి ఎదుర్కొంటారు. కొన్నిసార్లు ఈ సంఘర్షణలు.. విడాకుల వరకు వెళ్తుంది. పిల్లలు లేకపోవడం, పిల్లలు ఉన్నప్పటికీ ఎక్కువ కాలం జీవించక పోవడం, పిల్లలు మానసిక వికలాంగులు లేదా వికలాంగులు కావడం జరుగుతుంది. నిరంతరం అనారోగ్యంతో లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న కుటుంబ సభ్యులు చికిత్సకు కావలసిన ప్రభావాన్ని కలిగి ఉంటారు.
ఇంట్లో నిత్యం ఘర్షణలు..
వ్యాపారంలో నిరంతరం నష్టాలు, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక వృద్ధి లేకపోవడం.. అప్పులు పెరగడం, పొదుపు చేయకపోవడం తదితర అంశాలు ఎదుర్కొంటారు. ఇంట్లో నిత్యం తగాదాలు, విభేదాలతో అశాంతిగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం లేకపోవడం కూడా ఉంటుంది. ఇంట్లో నిరంతరం ప్రతికూల శక్తి, భయం లేదా శాంతి లేకపోవడం జరుగుతుంది. ఉద్యోగ స్థిరత్వం లేకపోవడం.. తరచుగా ఉద్యోగ మార్పులు లేదా వ్యాపారంలో పదే పదే వైఫల్యాలు ఎదుర్కొంటారు. ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు నిరంతరం అడ్డంకులు కలుగుతాయి. ఈ లక్షణాలన్నీ పితృ దోషం వల్ల సంభవిస్తాయి. ఈ నేపథ్యంలో ఆషాఢ అమావాస్య రోజు.. పై చెప్పినట్లు చేస్తే పితృదోషాలు సాధ్యమైనంత వరకు దూరమవుతాయని చెబుతారు.
Also Read:
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్..!
For More Devotional News And Telugu News
Updated Date - Jul 15 , 2025 | 07:25 PM