ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Lord Hanuman: హనుమంతుడిని సంకట మోచనుడు అని ఎందుకు అంటారు?

ABN, Publish Date - Dec 30 , 2025 | 07:11 AM

రామాయణం వినగానే మనకు గుర్తుకు వచ్చేది హనుమంతుడు. తన అపారమైన శక్తి, భక్తి, బుద్దిచాతుర్యంతో చేసిన పనుల గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే రామాయణంలో హనుమంతుని పాత్ర ఎంతో కీలకమైనది.

Sankat Mochan

హనుమంతుడు చిరంజీవి.. ఇప్పటికే ఆయన మన మధ్యనే ఉన్నాడని అంటారు. ఆపదలో ఉన్నా..భయంతో ఉన్నా.. జై హనుమాన్ అని అంటారు. హనుమంతుడికి లెక్కలేనన్ని పేర్లు ఉన్నాయి. ఆయన గుణాలను, చేసిన పనులను భట్టి భక్తులు స్వామిని ఎన్నో రకాల పేర్లతో పిలుస్తారు. హనుమంతుడిని ‘సంకట మోచనుడు’ అని పిలుస్తారు. హనుమంతుడు ఎంతటి ఆపదలు ఉన్నా సరే..క్షణాల్లో ప్రత్యక్షమై వాటి నుంచి రక్షిస్తాడు.

రామణ సంహారం తర్వాత, అయోధ్యకు శ్రీరాముడు బయలుదేరుతాడు. తిరిగి రావడానికి ఆలస్యమైతే అగ్ని ప్రవేశం చేస్తానని శపథం చేస్తాడు భరతుడు. కొన్ని కారణాల వల్ల శ్రీరాముడు తిరిగి వెళ్లడానికి ఆలస్యం అవుతుంది.. అది గమనించిన హనుమాంతుడు ముందుగానే వెళ్లి రాముడు వస్తున్నాడు అన్న శుభవార్తను భరతుడికి చేరవేస్తాడు. అలా భరతుడి ప్రాణాలు కాపాడి అయోధ్య రాజవంశానికి కలగబోయే ‘సంకటాన్ని’ తొలగిస్తాడు. అందుకే "సంకట మోచనుడు" అని అంటారు.

రావణుడితో యుద్దం చేస్తున్న సమయంలో ఆయన సోదరులైన అహిరావణ, మహిరావణ అనే మాయావులు రాముడిని, లక్ష్మణుడిని పాతాళ లోకానికి ఎత్తుకువెళ్తారు. వారిని బలి ఇవ్వడానికి చూస్తారు. హనుమంతుడు అక్కడికి వెళ్లి.. పంచముఖ హనుమంతుడిగా అవతారం ఎత్తి, ఐదు దిక్కుల్లో ఉన్న దీపాలను ఒకేసారి ఆర్పివేసి ఆ రాక్షసులను సంహరించి రాముడిని రక్షిస్తాడు.

సీతమ్మ జాడ తెలియన రాముడు దుఖఃంతో ఉంటే.. ఆ తల్లి జాడ కనిపెట్టి తన స్వామిని సంతోషపెడతాడు. ఇంద్రజిత్తు బాణానికి మూర్చపోయిన లక్ష్మణుడికి ఏకంగ సంజీవినీ పర్వతాన్నే పెకిలించి తీసుకువస్తాడు. లక్ష్మణుడి ప్రాణాలు కాపాడుతాడు. శని దోషం వల్ల ఇబ్బంది పడే వారు హనుమంతుడిని పూజిస్తారు. రావణుడి చెర నుంచి శనిదేవుడిని విడిపించినందుకు గాను, తన భక్తులను పట్టి పీడించనని శని.. హనుమంతుడికి మాట ఇస్తాడు. అందుకే హనుమంతుడిని జ్యోతిష్య పరమైన కష్టాలు (సంకటాలను) తొలగించే దైవంగా కొలుస్తారు.

Updated Date - Dec 30 , 2025 | 07:11 AM