Home » God
మండల పరిధిలోని హనకనహాళ్ రామాలయ ఉత్సవ రథానికి దుండగులు నిప్పు పెట్టారు. సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. గ్రామానికి చెందిన మూలింటి ఎర్రిస్వామి రెడ్డి కుటుంబ సభ్యులు రూ.19 లక్షలు వెచ్చించి మూడేళ్ల క్రితం రథాన్ని తయారు చేయించి పురాతన రామాలయానికి సమర్పించారు. రథాన్ని భద్రపరిచేందుకు ఆలయ ప్రాంగణంలో రేకుల షెడ్డు ఏర్పాటు చేశారు. ఉత్సవాల సమయంలో రథాన్ని గ్రామంలో ఊరేగించి, యథాస్థానంలో..
సాయి ట్రస్టు ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని శ్రీ7 కన్వెన్షన హాల్లో శనివారం శ్రీవారి సేవలో ఒకరోజు పేరుతో వెంకటేశ్వర వైభవం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కల్యాణోత్సవంతో పాటు వివిధ సేవలను నిర్వహించారు. ఈనేపథ్యంలో శనివారం ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో వేడుకలను ప్రారంభించారు. అనంతరం స్నపన తిరుమంజనం, అష్టదళ పద్మార్చన, తోమాల సేవ, పుష్పయాగం, తిరుప్పాడ సేవ, ఏడుశనివారాల వ్రతం, హనుమంత వాహన సేవ, నిర్వహించారు.
అనంతపురం నగరంలో ఐదురోజులపాటు విశేష పూజలు అందుకున్న గణనాథుడు బుధవారం గంగమ్మ ఒడికి చేరారు. అంతకు మునుపు మండపాల వద్ద పెద్దఎత్తున అన్నదానం చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సప్తగిరి సర్కిల్లోని వినాయక్ చౌక్ వరకూ శోభాయాత్రలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి దారిపొడవునా భక్తులు బారులు తీరారు. ఆకట్టుకునే వేషధారణలతో రంగులు చల్లుకుంటూ యువత ఉత్సాహంగా వేడుకలలో పాల్గొంది. వినాయక్ ...
మండల పరిధిలోని పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వా మి ఆలయంలో ఆదివారం ప్ర త్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఉదయం అభిషేకం చేసి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు.వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా జిల్లా నలుమూలల నుం చి వందలాదిమంది భక్తులు త రలివచ్చి స్వామివారిని దర్శించు కున్నారు.
నగరంలోని పలు ఆలయాల్లో శనివారం ఏడుశనివారాల వ్రతాన్ని కనులపండువగా నిర్వహించారు. ఏడు శనివారాల్లో అనివార్య కారణాలవల్ల పాల్గొన లేని మహిళలు కోసం 8వ వారం వ్రతం నిర్వహించడం ఆనవా యితీగా వస్తోంది.
వినాయక చవితిని పురస్కరించుకుని హిందూపురంలో విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు మండపాలను సిద్ధం చేశా రు. గతంలో ఎన్నడూలేని విధంగా భారీ ఎత్తున విగ్రహాలు ఏర్పాటు చేయ నున్నారు. కరోనా తరువాత ఎక్కువ సంఖ్యలో విగ్రహాల ఏర్పాటు ఈసారి జరుగనున్నట్లు పోలీసుల వద్ద అనుమతులను బట్టి తెలుస్తోంది.
హిందూపురాన్ని శాంతి పురంగా పేరు తీసుకురావాలని జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. వి నాయక నిమజ్జనం శాంతి యుతంగా జ రపాలని సూచించారు. స్థానిక కేవీఆర్ ఫంక్షన హాల్లో ఎస్పీ బుధవారం హిందూ, ముస్లిం, క్రైస్తవులతో పాటు వివిధ మతాలు కులస్తులతో శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ఉమ్మడి తెలుగు రాష్ర్టాల్లో హైదరాబాద్ తరువాత హిందూపురం వినాయక ని మజ్జనం రెండో స్థానంలో ఉందన్నారు.
పట్టణంలోని మధు థియేటర్ వెనుక నున్న ఆలయంలో దుగ్గిలమ్మ దేవత జాతరను మంగళవారం భక్తి శ్రద్ధలతో నిర్వ హించారు. అమ్మవారికి ఉదయాన్నే పంచామృతాభిషేకం, కుంకుమార్చన, పుష్పా లంకరణ, వెండి కవచధారణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి వేపాకు, చీర, ముడుపులు చెల్లించారు. అనంతరం బలిదాన కార్యక్రమం నిర్వ హించారు.
మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షి ద్దాం అంటూ స్ధానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషషర్ జబ్బర్ మీయా ఆధ్వర్యంలో పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. రానున్న వినా యక చవతి పండుగ సందర్భంగా ప్రజలు, రసాయనాలతో చేసిన వినాయక ప్రతిమలు కాకుండా మట్టి వినాయకులను మాత్రమే పూజించాలని ఆయన కోరారు.
వినాయకచవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతూ, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవా లని ఆర్డీఓ రాణిసుస్మిత, డీఎస్పీ రవిబాబు తెలిపారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఎంపీడీఓలు, సీఐలు, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్లతో వారు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.