God : భక్తిశ్రద్ధలతో సత్యదేవుని వ్రతాలు
ABN , Publish Date - Aug 10 , 2025 | 12:37 AM
శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని శనివారం జిల్లావ్యాప్తంగా వాడవాడలా సత్యదేవుని వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాలు కిక్కిరిశాయి. అనంతపురంలోని అశోక్‌నగర్‌లోని సత్యదేవుని ఆలయంతోపాటు ...
కిక్కిరిసిన ఆలయాలు
అనంతపురం టౌన, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని శనివారం జిల్లావ్యాప్తంగా వాడవాడలా సత్యదేవుని వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాలు కిక్కిరిశాయి. అనంతపురంలోని అశోక్‌నగర్‌లోని సత్యదేవుని ఆలయంతోపాటు షిర్డీసాయిబాబా మందిరాల్లో సత్యనారాయణస్వామికి ప్రత్యేక
అలంకరణలు చేశారు. వేదపండితులు వ్రత విశిష్ఠతను వివరిస్తుండగా భక్తులు సామూహికంగా వ్రతాలను ఆచరించారు. హరిహర దేవాలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా హయగ్రీవస్వామికి భక్తుల చేతులమీదుగా పంచామృతాభిషేకాలు చేయడంతోపాటు ప్రత్యేక అలంకరణలు, విశేష పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..