వైభవంగా బొలికొండ రంగనాథుడి కల్యాణం
ABN , Publish Date - Aug 10 , 2025 | 12:27 AM
మండలంలోని జక్కలచెరువు గ్రామంలో వెలసిన బొలికొండ రంగనాథస్వామి ఆలయంలో శనివారం కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా వేకువజామున స్వామివారికి పంచామృతాభిషేకం, ...
గుత్తిరూరల్, ఆగస్టు9(ఆంధ్రజ్యోతి): మండలంలోని జక్కలచెరువు గ్రామంలో వెలసిన బొలికొండ రంగనాథస్వామి ఆలయంలో శనివారం కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా వేకువజామున స్వామివారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన చేశారు. వివిధ పుష్పాలతో అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 8 గంటలకు శాంతి హోమం చేపట్టారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత బొలికొండ రంగనాథ
స్వామి ఉత్సవమూర్తులకు అర్చకులు కల్యాణం నిర్వహించారు. స్వామి వారిని ఎమ్యెల్యే జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ దర్శించుకున్నారు. కల్యాణాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సాయంత్రం ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి ఊంజల సేవ చేశారు. రాత్రి రాష్ట్రస్థాయి భజనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ శోభ, అర్చకులు రవిస్వామి, నవీన, చేతన పాల్గొన్నారు.