Share News

VaraLakshmi Vratam : సంపదలివ్వు తల్లీ..!

ABN , Publish Date - Aug 08 , 2025 | 12:42 AM

వరలక్ష్మీ వ్రత నిర్వహణకు మహిళలు సిద్ధమయ్యారు. పూజా సామగ్రిని ముందురోజే సమకూర్చుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మార్కెట్‌లు కొనుగోలుదారులతో సందడిని సంతరించుకున్నాయి. ఏటా శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన వరలక్ష్మి దేవిని ఆరాధిస్తూ వ్రతాలను ఆచరిస్తారు. వేకువనే నిద్రలేచి,ముంగిట కల్లాపి చల్లి, గడపకు పసుపు పట్టించి, మామిడి ఆకుల తోరణాలు కడతారు. ...

VaraLakshmi Vratam : సంపదలివ్వు తల్లీ..!
The village is packed with people..

నేడు వరలక్ష్మీ వ్రతం

మార్కెట్‌లలో సందడి

అనంతపురం టౌన, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): వరలక్ష్మీ వ్రత నిర్వహణకు మహిళలు సిద్ధమయ్యారు. పూజా సామగ్రిని ముందురోజే సమకూర్చుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మార్కెట్‌లు కొనుగోలుదారులతో సందడిని సంతరించుకున్నాయి. ఏటా శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన వరలక్ష్మి దేవిని ఆరాధిస్తూ వ్రతాలను ఆచరిస్తారు. వేకువనే నిద్రలేచి,ముంగిట కల్లాపి చల్లి, గడపకు పసుపు పట్టించి, మామిడి ఆకుల తోరణాలు కడతారు. విశాలమైన గదిలో అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసి, సంకల్పం, సహస్రనామార్చనాది పూజలను నిర్వహిస్తారు. తొమ్మిది రకాల పిండివంటలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. తొమ్మిది ముడులతో తయారు చేసిన కంకణాలను అమ్మవారి ముందు ఉంచి పూజిస్తారు. ఈ కంకణాలను పూజల్లో పాల్గొన్న మహిళల కుడిచేతికి కట్టి, పిండివంటలను వాయనాలుగా


అందజేయడంతో వ్రతం పరిసమాప్తమవుతుంది.

దేవతలకు ఇష్టమైన మాసం...

జగన్మాత మూడురూపాల్లో లక్ష్మీదేవి రూపం ఒకటి. తనను భక్తిశ్రద్ధలతో కొలిచేవారికి సిరిసంపదలను ప్రసాదించే దేవత వరలక్ష్మి. శ్రావణం దేవతలకు ఇష్టమైన మాసం. ఈ మాసంలో మహిళలు భర్తతో కలిసి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు ఉంటాయి.

-కిశోర్‌ శర్మ, పురోహితుడు

సకల సంపదలు..

మహిళలకు భక్తిశ్రద్ధలు ఎక్కువ. వరలక్ష్మీ వ్రతంలో ఇది ప్రతిబింబిస్తుంది. ఈ వ్రతాన్ని నిష్టగా ఆచరించేవారికి పుట్టినింట, మెట్టినింట ప్రేమాభిమానాలు పెరుగుతాయి. సకల సంపదలు సిద్ధిస్తాయి. అందుకే వరలక్ష్మీ వ్రతం కోసం మహిళలు ఏడాదంతా ఎదురుచూస్తుంటారు.

- నాగేశ్వరి, టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత సభ్యురాలు

(మరిన్ని అనంతపురం వార్తల కోసం..)

Updated Date - Aug 08 , 2025 | 12:42 AM