Share News

ISKCON Temple : విద్యుద్దీప వెలుగుల్లో ఇస్కాన మందిరం

ABN , Publish Date - Aug 14 , 2025 | 12:28 AM

రంగురంగుల విద్యుద్దీప వెలుగుల్లో నగర శివారులోని ఇస్కాన మందిరం కాంతులీనుతోంది. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఇస్కాన మందిరంలో ఈనెల 15 నుంచి 17వతేదీ వరకు మూడురోజులపాటు వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇస్కాన మందిరానికి నూతన...

 ISKCON Temple : విద్యుద్దీప వెలుగుల్లో ఇస్కాన మందిరం

కృష్ణాష్టమి వేడుకలకు ముస్తాబు

అనంతపురం టౌన, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): రంగురంగుల విద్యుద్దీప వెలుగుల్లో నగర శివారులోని ఇస్కాన మందిరం కాంతులీనుతోంది. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఇస్కాన మందిరంలో ఈనెల 15 నుంచి 17వతేదీ వరకు మూడురోజులపాటు వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇస్కాన మందిరానికి నూతన రంగులు వేయడంతోపాటు బుధవారం సాయంత్రం రకరకాల విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. జాతీయ రహదారికి పక్కనే మందిరం వెలుగులీనుతుండడం బాటసారులు, వాహదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

మ‌రిన్ని అనంత‌పురం వార్త‌ల కోసం...

Updated Date - Aug 14 , 2025 | 12:28 AM