Varalakshmi Vratham : వరాల తల్లికి విశేష పూజలు
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:57 AM
జిల్లావ్యాప్తంగా వరలక్ష్మీ వ్రతాలను మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో శుక్రవారం నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, విశేష పూజలు చేశారు. ఇళ్లల్లో వరలక్ష్మీ వ్రతం చేసే సంప్రదాయం లేనివారు సమీప ఆలయాల్లో నిర్వహించారు. జిల్లా కేంద్రంలో కొత్తూరు వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఉదయాన్నే వాసవీమాతకు పంచామృతాభిషేకాలు, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి ..
జిల్లావ్యాప్తంగా వరలక్ష్మీపూజలు, వ్రతాలు
అనంతపురం టౌన, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా వరలక్ష్మీ వ్రతాలను మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో శుక్రవారం నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, విశేష పూజలు చేశారు. ఇళ్లల్లో వరలక్ష్మీ వ్రతం చేసే సంప్రదాయం లేనివారు సమీప ఆలయాల్లో నిర్వహించారు. జిల్లా కేంద్రంలో కొత్తూరు వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఉదయాన్నే వాసవీమాతకు పంచామృతాభిషేకాలు, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి పూజించారు. అనంతరం ఆలయానికి చేరుకున్న మహిళలు సామూహికంగా
వరలక్ష్మీ వ్రతాలను ఆచరించారు. ఐదో రోడ్డులోని కనకదుర్గ దేవాలయంలోనూ వరలక్ష్మీ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేకువజామునే అమ్మవారికి సుప్రభాత సేవ చేశారు. మూలవిరాట్‌కు పసుపు కుంకుమలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. శారదానగర్‌లోని శృంగేరి శంకరమఠం, మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయం, చౌడేశ్వరి దేవాలయం, పాతూరులోని వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయం, మహాలక్ష్మి ఆలయం, రామ్‌నగర్‌లోని పెద్దమ్మ దేవాలయం, హెచ్చెల్సీ కాలనీలోని నసనకోట ముత్యాలమ్మ దేవాలయం తదితర ప్రాంతాల్లోని ఆలయాల్లోనూ విశేష పూజలు నిర్వహించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..